జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రారంభం.. నాలుగు దశాబ్దాల కల సాకారం!

Publish Date:May 28, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రజల నాలుగు దశాబ్దాల  నిరీక్షణకు తెరపడింది.  ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ పోరాటానికి ఎట్టకేలకు  చారిత్రాత్మక విజయం లభించింది. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ కావాలంటూ సాగిన ఉద్యమాలు, నాయకుల త్యాగాలు ఫలించాయి. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో..  విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా నూతనంగా ఏర్పాటైన  సౌత్ కోస్ట్ రైల్వే జోన్ (ఎస్ సీఓఆర్)  జూన్ 1, 2026 నుండి   అధికారిక కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ చారిత్రక పరిణామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లనుందనడంలో సందేహం లేదు. 

రైల్వే పరిపాలనను   సులభతరం చేసేందుకు,  మౌలిక వసతుల అభివృద్ధి వేగం పుంజుకునేందుకు  వేగంగా అభివృద్ధి చేసేందుకు ఎస్ సీఓఆర్  దోహదపడుతుంది.  తొలుత  ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు తాత్కాలికంగా సిరిపురం వద్ద ఉన్న వీఎంఆర్‌డీఏ   ది డెక్  భవనంలోని ఐదు, ఆరు అంతస్తుల నుండి సాగుతాయి.  జనరల్ మేనేజర్ సందిప్ మాథుర్ నేతృత్వంలో దాదాపు 6 నుండి 8 ముఖ్య విభాగాలు ఈ తాత్కాలిక కార్యాలయం నుంచే పనిచేయడం ప్రారంభిస్తాయి.

మరోవైపు ముదసర్లోవ వద్ద దాదాపు 54 ఎకరాల భారీ విస్తీర్ణంలో శాశ్వత రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక శాశ్వత భవన సముదాయాన్ని మూడు సంవత్సరాల కాలపరిమితిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిర్మాణ పనుల కోసం ఇప్పటికే  106 కోట్ల నిరూపాయలను  కేంద్రం విడుదల చేసింది. 

రైల్వే పునర్వ్యవస్థీకరణ చట్టం 1989 ప్రకారం ఏర్పాటైన ఈ  కొత్త 18వ రైల్వే జోన్ పరిధి ఎంతో విస్తృతమైనది. ఇది సుమారు 3,496 కిలోమీటర్ల సుదీర్ఘమైన రూట్ పొడవు కలిగి ఉంది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు తీర రైల్వేలలోని కొన్ని కీలక భాగాలను పునర్వ్యవస్థీకరించడం ద్వారా ఈ జోన్ రూపుదిద్దుకుంది. దీని పరిధిలోకి ప్రస్తుత విజయవాడ, గుంటూరు,  గుంతకల్ రైల్వే డివిజన్లు రానున్నాయి. వీటితో పాటు గతంలో తూర్పు తీర రైల్వేలో భాగంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ను పునర్వ్యవస్థీకరించి విశాఖపట్నం డివిజన్ గా మార్చారు.

ఈ మార్పుల వల్ల పాత వాల్తేరు డివిజన్ రెండు భాగాలుగా విడిపోయింది. అందులో ఒక భాగం తూర్పు తీర రైల్వే పరిధిలోనే కొత్తగా ఏర్పడిన రాయగడ డివిజన్‌గా మారగా,  మిగిలిన ప్రధాన భాగం విశాఖపట్నం డివిజన్‌గా మారి సౌత్ కోస్ట్ రైల్వేలో విలీనమైంది. అలాగే గతంలో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న కొండపల్లి-మోటుమర్రి సెక్షన్‌ను ఇప్పుడు విజయవాడ డివిజన్‌లో విలీనం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల విశాఖలో ఉన్న తాత్కాలిక జోన్ కార్యాలయాన్ని సందర్శించి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.  

By
en-us Political News

  
హైదరాబాద్ మల్కాజిగిరి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ గల్లంతైన రాము, లక్ష్మి దంపతుల అదృశ్యం వెనుక మిస్టరీ ఏంటి? కూతురితో చివరి కాల్, ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిన వైనంపై పూర్తి వివరాలు.
ఒడిలో చిన్నారిని పెట్టుకుని ఎన్నో కలలు కన్న ఆ తల్లి ఆశలు క్షణాల్లో ఆవిరైపోయాయి. పసిబిడ్డ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో నెలకొన్న హృదయ విదారక విషాదంపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నంలో ప్రేమ పేరుతో జరిగిన ద్రోహం వల్ల తీవ్ర మనోవేదనకు గురై అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన పూర్తి వివరాలు వెబ్‌ స్టోరీలో చదవండి.
రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించింది. అయితే ఈ కేటాయింపును సవాలు చేస్తూ ఆమె గతంలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.
హైదరాబాద్‌ బొల్లారం పరిధిలోని కౌకూర్‌లో బతుకమ్మ వేడుకల్లో అదృశ్యమైన ఐదేళ్ల చిన్నారి రూ.20 లక్షల డిమాండ్ కోసం హత్యకు గురైంది. గేటెడ్ కమ్యూనిటీ సంపులో శవంగా తేలిన పాప ఉదంతంపై పూర్తి వివరాలు.
హైదరాబాద్ మాదాపూర్‌లో పనిచేస్తున్న 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనారోగ్య సమస్యలతో హీలియం గ్యాస్ పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. 12,000 మంది బలగాలు, సీఆర్పీఎఫ్ మోహరింపు మరియు పోలీసు ఆంక్షల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.