ఫార్ములా ఈ-కార్ రేస్‌ కేసు.. నాంపల్లి కోర్టుకు కేటీఆర్‌ గైర్హాజరు..!

Publish Date:Aug 25, 2026

Advertisement

 

ఫార్ములా ఈ-కార్ రేస్‌ కేసులో నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌కుమార్‌, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. అయితే మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మాత్రం కోర్టుకు హాజరుకాలేదు. 

వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నట్లు కేటీఆర్‌ తరఫు న్యాయవా దులు ఆబ్సెంట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్‌ 18కు వాయిదా వేసింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, నిధుల చెల్లింపుల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. 

ఈ వ్యవహారంలో కేటీఆర్‌, అరవింద్‌కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డిలను నిందితులుగా పేర్కొంటూ ఏసీబీ 2026 మార్చిలో 77 పేజీల చార్జిషీట్‌ దాఖలు చేసింది. హెచ్‌ఎండీఏ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్స్‌కు సుమారు రూ.54.88 కోట్ల చెల్లింపుల వ్యవహారాన్ని ఏసీబీ ప్రధానంగా ప్రస్తావించింది. గత జూలై 31న చార్జిషీట్‌ అనంతరం తొలిసారి నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్‌, అరవింద్‌కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డి రూ.లక్ష పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలను సమర్పించారు. 

అనంతరం కేసును ఆగస్టు 25కు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కోర్టులో విచారణ జరిగింది. అయితే కేటీఆర్ వ్యక్తిగత కారణాల వల్ల కోర్టుకు హాజరు కాలేదు. దీంతో కోర్టు తదుపరి విచారణ వచ్చేనెల 18వ తారీకు వాయిదా వేసింది. ప్రభుత్వ నిధుల చెల్లింపుల్లో నిబంధనలు ఉల్లంఘించారన్నది ఏసీబీ ఆరోపణ కాగా, ఫార్ములా ఈ రేస్‌ను హైదరాబాద్‌ను అంతర్జాతీయ క్రీడా, ఆటోమొబైల్‌ హబ్‌గా నిలబెట్టే ఉద్దేశంతో నిర్వహించామని కేటీఆర్‌ వర్గం ఆరోపణలను ఖండిస్తోంది. కేసులో తదుపరి న్యాయపరమైన పరిణామాలపై సెప్టెంబర్‌ 18న స్పష్టత రానుంది.

Formula E car race case, KTR, Nampally Court, Arvind Kumar, Engineer BLN Reddy, HMDA, ACB Case, KCR, BRS Party

By
en-us Political News

  
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
2026 రక్షాబంధన్ సందర్భంగా సోదరుడి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం మరియు దీర్ఘాయువు కోసం సోదరీమణులు చేయాల్సిన పవిత్ర దానాల విశిష్టతలను తెలుసుకోండి. ఆహార ధాన్యాలు, బెల్లం, వస్త్రాలు మరియు నల్ల నువ్వుల దానం వల్ల కలిగే ఆధ్యాత్మిక, జ్యోతిష్య ప్రయోజనాలు ఇవే!
పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని ₹15 కోట్లతో దశలవారీగా పునర్నిర్మించనున్నారు. పర్యాటక శాఖ నుండి మరో ₹8 కోట్లు, భక్తుల కోసం 22 నూతన వసతి గదుల నిర్మాణానికి భూమిపూజ చేశారు. పూర్తి వివరాలు చదవండి.
కేరళ తీరం నుండి కార్గిల్ మంచు ఎడారుల వరకు భారతీయ పర్యావరణం, అడవులు మరియు నీటి వనరుల సంరక్షణలో ఇస్లామిక్ ఆధ్యాత్మిక సంప్రదాయాలు మరియు సూఫీ సంస్కృతి పోషించిన అరుదైన చారిత్రక పాత్రను సమగ్రంగా తెలుసుకోండి
ఉద్యోగాలు, ఉపాధి కోసం నగరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, శివారు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజూ ప్రయాణించే వారికి రాత్రివేళ ప్రజా రవాణా కొరత ఇబ్బందిగా మారుతోంది.
ఎల్‌ఐసీ ఆన్‌లైన్ పోర్టల్‌లో క్రెడిట్ కార్డ్ ద్వారా ప్రీమియం చెల్లింపుల సదుపాయాన్ని హఠాత్తుగా నిలిపివేశారు. పేమెంట్ గేట్‌వే ఛార్జీల వివాదమే దీనికి కారణమా పూర్తి వివరాలు, ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాలు ఇక్కడ తెలుసుకోండి.
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదిత అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రముఖ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత షావుకారు జానకి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.
వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు.   ఆమె భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం చెన్నైలోని తేనాంపేట, సెంట్ ఆఫ్‌ రోడ్‌లో ఉన్న ఆమె నివాసంలో ఉంచారు.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.