పైలట్ నుంచిహో మంత్రి వరకు...

Publish Date:Dec 7, 2023

Advertisement

దేశ సేవే పరమావధిగా పైలట్ గా అడుగుపెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి విలక్షణ శైలి. ఈ పేరు వింటే తెలుగు ప్రజల్లో ఒక ఉత్సాహం నెలకొంటుంది.  ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ లో విధులు నిర్వర్తించారు. ఎయిర్ ఫోర్స్ లో ఉన్నా.. రాష్ట్రపతి భవన్ లో విధులు నిర్వర్తించిన ఉత్తమ్ కుమార్  అది ప్రజా సేవే అని భావించేవారు.  ఆ సేవ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి  ఆయన అడుగుపెట్టారు. ప్రజలకు సేవ చేయాలి అని ఆయనలో వచ్చిన ఆ ఆలోచన ఇప్పుడు హోమ్ మంత్రి వరించేలా చేసింది.   ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టింది మొదలు ఇప్పటివరకు ప్రజా సేవే ప్రధాన అజెండాగా  ఆయన ముందుకు సాగారు. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే సీనియర్ నేతగా ఉత్తమ్ కుమార్ చేసిన కృషి ఎనలేనిది. ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టినున్న సందర్భంగా ఉత్తమ్ కుమార్ రాజకీయ ప్రస్థానం గురించి  చర్చించుకోవాల్సిన తరుణమిది. 
1962 జూన్ 20న సూర్యాపేటలో పురుషోత్తంరెడ్డి- ఉషారాణి దంపతులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మించారు. ఆయన బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత భారత వైమానిక దళంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పైలట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ సేవలో తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత భారత రాష్ట్రపతి భవన్ లో సేవలు అందించారు. రాష్ట్రపతి విదేశీ ప్రయాణాల్లో సెక్యూరిటీ ప్రొటోకాల్ కంట్రోలర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎనలేని సేవలు అందించారు. అలాంటి ఒక గొప్ప పదవిలో ఉన్న వ్యక్తి ఎంతో సంతోషంగా తన జీవితాన్ని గడిపేయచ్చు. రిటైర్ అయిన తర్వాత భార్యాపిల్లలు, మనువలు, మనవరాళ్లు అంటూ జీవితాన్ని సంతోషంగా గడిపేయచ్చు. కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ దారిని ఎంచుకోలేదు. రాజకీయ బాటలో ముళ్లుంటాయని తెలిసినా రాజకీయాల్లోకి రావాలి అని బలంగా సంకల్పించారు.  దేశ సేవ చాలించి ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజా సేవ, రాజకీయాలు అంటే అవమానాలు, విమర్శలు, ఛీత్కారాలు ఉంటాయని తెలిసినా కూడా కావాలనే రాజకీయాల్లోకి వచ్చారు.
కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని, పార్టీకి అండగా ఉన్న నాయకులు, సీనియర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒకరు. ఆయన రాజకీయ ప్రస్థానం 1994లో ప్రారంభమైంది. కాంగ్రెస్ తరఫున 1994లో కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ, ఆ సమయంలో ఉత్తమ్ కు ఓటమి తప్పలేదు. కానీ, ఓటమితో ఆయన కుంగిపోలేదు. ప్రజాక్షేత్రంలోనే తన పోరాటాన్ని కొనసాగించారు. తర్వాతి దఫా 1999లో ఎన్నికల్లో మళ్లీ కోదాడ స్థానం నుంచే పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004 ఎన్నికల్లో రెండోసారి కోదాడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం పోటీ చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడ్డ హుజూర్ నగర్ నుంచి పోటీ చేశారు. అప్పుడు కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014, 2018లో కూడ హుజూర్ నగర్ స్థానం నుంచే బరిలోకి దిగిన ఉత్తమ్ కుమార్ ఘన విజయం సాధించారు. 2019లో నల్గొండ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహా రెడ్డిపై 25,682 ఓట్ల మెజారిటీతో అద్భుతమైన విజయం సొంతం చేసుకున్నారు.
తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హుజూర్ నగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి.. ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నో కీలక  బాధ్యతలను కూడా నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ గా చేశారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో గృహ, బలహీన వర్గాల మంత్రిగా సేవలందించారు. 2015 నుంచి 2021 మధ్య తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా  కూడా ఉత్తమ్ కుమార్ పని చేశారు. తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే సీనియర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన సేవను పార్టీ సైతం మర్చిపోలేదు. అందుకే పార్టీలో ఉన్న ఒక సీనియర్ నేతను మంత్రి పదవితో గౌరవించింది. ఒక పైలట్ గా దేశానికి సేవలందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు మూడు దశాబ్దాలుగా అంతే బాధ్యతగా ప్రజాసేవకు అంకితమయ్యారు.

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.