కమలం గూటికి మాజీ మంత్రి తుమ్మల?!.. పాలేరు నుంచి పోటీ!

Publish Date:Aug 21, 2023

Advertisement

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంతగా సర్దుకు పోదామనుకున్నా బీఆర్ ఎస్ లో ఇమడ లేని పరిస్థితి ఏర్పడింది. పాలేరు టికెట్ ఆశించిన ఆయనకు కేసీఆర్ తాజా జాబితాలో మొండి చేయి చూపారు. దీంతో ఆయన ఇక బీఆర్ఎస్ లో కొనసాగే అవకాశాలు ఇసుమంతైనా లేవని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అసలు గత కొంత కాలంగా తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ లో ఉక్కపోతకు గురౌతున్నారు.

గతంలో ఒక సారి భవిష్యత్  కార్యాచరణపై  నిర్ణయం తీసుకునేందుకు తుమ్మల తన అభిమానులతో ములుగులో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి దాదాపు 350 కార్లలో వాజేడు చేరుకున్నారు.  అంతకు ముందు  భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.నాటి ఆత్మీయ సమ్మేళనం ఉద్దేశం  పార్టీ మార్పుపై చర్చించేందుకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తుమ్మల ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, మద్దతు దారులు, అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఆ తరువాత ఆయన పార్టీ మార్పుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ వచ్చినందునే ఆయన బీఆర్ఎస్ వీడలేదని అప్పట్లో గట్టిగా వినిపించింది.   2018 ఎన్నికలలో  తుమ్మల బీఆర్ఎస్ అభ్యర్థిగా పరాజయం పాలైన తరువాత ఆయన పార్టీలో ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయిందనే చెప్పాలి.  ఎవరు ఔనన్నాకాదన్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల బలమైన నేత. ఆ విషయంలో  బీఆర్ఎస్ అధినేత కే సీఆర్ కు కూడా స్పష్టత ఉంది.

అందుకే ఎప్పటికప్పుడు ఆయనను బుజ్జగిస్తూ, హామీలు ఇస్తూ బీఆర్ఎస్ ను వీడకుండా చూసుకుంటూ వచ్చారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే సమయంలో కేసీఆర్ కనీసం తనను సంప్రదించకపోవడం, ఏక పక్షంగా పాలేను అభ్యర్థిని ప్రకటించడంతో తుమ్మల ఇక బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకోవాలన్న కృత నిశ్చయానికి వచ్చేశారు. అయితే ఆయన బీ ఆర్ఎస్ ను వీడితే ఆయన అడుగులు ఎటుపడతాయన్న దానిపై ఖమ్మం రాజకీయాలలో విస్తృత చర్చ జరుగుతోంది. తుమ్మలకు అన్ని రాజకీయ పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. మాజీ మంత్రిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పలుకుబడి కూడా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ను వీడాలని నిర్ణయించుకున్న తరువాత ఆయన ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని అంటున్నారు.  

తొలి నుంచీ తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన తుమ్మల రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం పార్టీని వీడి బీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం గూటికి వెళతారా అన్నచర్చ జరుగుతోంది. మరో వైపు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు బలమైన నేతలు ఉన్న నేపథ్యంలో ఉన్న బలానికి తోడు తుమ్మల వస్తే మరింత బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నదని అంటున్నారు. ఇలా ఉండగా గత రెండు మూడు రోజులుగా తుమ్మలతో బీజేపీ నేతలకు టచ్ లోకి వచ్చారని  రాజకీయాలలో విస్తృత చర్చ జరుగుతోంది.  ఇక తెరాసలో తుమ్మల ప్రస్థానాన్ని ఒక సారి అవలోకనం చేసుకుంటే.. 2014లో తెరాస గూటికి చేరిన తుమ్మల అప్పుడు జరిగిన  ఎన్నికలలో పరాజయం పాలయ్యారు. అయితే  కేసీఆర్ ఆయనను ఎమ్మెల్సీగా గెలిపించి తన కేబినెట్ లో పదవి  ఇచ్చారు. అయితే 2018 ఎన్నికలలో ఓటమి తరువాత తుమ్మలకు తెరాసలో ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. మరో సారి ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం ఇస్తారని తుమ్మల ఆశించారు. అయితే కేసీఆర్ ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన తుమ్మల పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు. ఆయన బీజేపీ గూటికి చేరుతారని గతంలో బలంగా వినిపించినా తుమ్మల అప్పట్లో ఖండించారు.  దీంతో ఆయన కాంగ్రరెస్ గూటికి చేరుతారన్న వదంతులు బలంగా వినిపించాయి.  అయితే తుమ్మల నుంచి మాత్రం ఎటువంటి స్పందనా రాలేదు.

ఇప్పుడు ఇక బీజేపీ తన అవసరాల కోసం తుమ్మలను ఎలాగైనా పార్టీలోకి చేర్చుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోందని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ నాయకత్వం తుమ్మలతో టచ్ లోకి వచ్చి పార్టీలో చేర్చుకునే దిశగా చర్చలు జరిపిందని అంటున్నారు. ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లేననీ, తుమ్మల కూడా బీజేపీ గూటికి చేరడానికి సుముఖత వ్యక్తం చేశారనీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పాలేరు నుంచి కమలం టికెట్ షరతు విధించారని పరిశీలకులు అంటున్నారు.  అందుకు బీజేపీ కూడా అంగీకరించిందని రాజకీయవర్గాలలో ఓ టాక్ నడుస్తోంది. 

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.