Publish Date:Sep 27, 2024
టిటిడి చైర్మన్ గా సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రక్షాళన చేపట్టింది. గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఈవో ధర్మారెడ్డిని తొలగించినప్పటికీ చైర్మన్ పదవిని ఎవరికీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తిరుపతి లడ్డూలో పందికొవ్వు ఉందని ల్యాబ్ రిపోర్ట్ రావడంతో దేశ వ్యాప్తంగా సంచలనమైంది. పరమపవిత్రమైన తిరుమల క్షేత్రంలో జంతు అవశేషాలతో కూడిన లడ్డూలను భక్తులకు విక్రయించడం వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే తిరుపతి లడ్డూ పరీక్షలు జరిగాయి. నాణ్యత లోపాలు ఉన్నాయని ఫిర్యాదులు అందడంతో కూటమి ప్రభుత్వం ఈ పరీక్షలు చేపట్టింది. ల్యాబ్ రిపోర్టు ఆలస్యంగా వచ్చాయి. లడ్డూలో పందికొవ్వు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. గత ప్రభుత్వం నియమించిన కాంట్రాక్టర్లను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో వైసీపీ ప్రతిష్ట పూర్తిగా మసకబారిపోయింది. గత వైసీపీ ప్రభుత్వంలో చైర్మన్లుగా పని చేసిన భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి దోషులుగా నిలబడాల్సి వచ్చింది. కీలకమైన టిటిడి చైర్మన్ పదవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ తెరదించారు. ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్, సినీ నిర్మాత అశ్వినీదత్ పేర్లు వినిపించాయి. తాజాగా గురువారం మరో పేరు ప్రచారంలో వచ్చింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉన్న ఎన్ వి రమణ ధర్మ పరిరక్షణ కోసం అనేక చారిత్రాత్మక తీర్పులను వెలువరించారు. రెండేళ్ల క్రితం ఆయన పదవీ విరమణ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-supreme-chief-justice-nv-ramana-as-chairman-of-ttd-25-185698.html
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.