మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్
Publish Date:Aug 10, 2020
Advertisement
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రత్యేక కార్యక్రమంపై తాను ఆసుపత్రికి వెళ్లానని, ఈ సందర్భంగా, కరోనా పరీక్ష చేయించుకోగా తనకు పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు. ఇటీవల తనను కలిసినవారు సెల్ఫ్ ఐసొలేషన్ అవ్వాలని, అలాగే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇక భారత్లో గత 24 గంటల్లో కొత్తగా 62,064 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,007 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,15,075కి చేరగా, మృతుల సంఖ్య 44386కి చేరింది. ప్రస్తుతం దేశంలో 6,34,945 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-president-pranab-mukherjee-has-tested-positive-for-covid-19-39-102595.html
http://www.teluguone.com/news/content/former-president-pranab-mukherjee-has-tested-positive-for-covid-19-39-102595.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





