అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు.. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లు కొట్టివేత
Publish Date:Mar 30, 2026
Advertisement
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనను ఇరుకున పెట్టే ఉద్దేశంతో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన మూడు పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం, ఆ మూడింటినీ కొట్టిసింది. ఆళ్ల దాఖలు చేసిన ఈ మూడు పిటిషన్లకు కనీస విచారణార్హత లేదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం విస్పష్టంగా చెప్పింది. కాగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ లో అక్రమాలు జరిగాయనీ, కాబట్టి ఈ కేసు దర్యాప్తును రాష్ట్ర పోలీసుల నుండి సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆళ్ల ఒక పిటిషన్ వేశారు. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు గతంలో మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ మరో పిటిషన్, ఏసీబీ కోర్టులో ప్రస్తుతం జరుగుతున్న ఈ కేసు విచారణను ప్రజాప్రతినిథుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని మూడో పిటిషన్ దాఖలు చేశారు. ఒకే కేసుకు సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఈ మూడు పిటిషన్లు కూడా చట్టపరంగా నిలబడవని, వీటికి విచారణార్హత లేదని హైకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ దురుద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్లుగా వీటిని అభివర్ణించింది. గత ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసులతో చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని చూసిందంటున్న తెలుగుదేశం వాదనకు ఈ తీర్పు బలం ఇచ్చినట్లైంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఈ అంశంపై కొత్తగా తలెత్తిన న్యాయపరమైన సవాళ్లకు తెరపడింది. తన పిటిషన్ లో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలనీ, చంద్రబాబుకు మంజూరు చేసిన బెయిలు రద్దు చేయాలనీ, అలాగే ఈ కేసును ఏసీబీ కోర్టు నుంచి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు బదలీ చేయాలనీ కోరారు. కొందరికి వ్యక్తిగతంగా లాభం చేకూర్చేందుకే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను మార్చారని గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లకు విచారణార్హత లేదని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాటిని కొట్టివేసింది. ఈ తీర్పు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీకి గట్టి ఎదురుదెబ్బగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే న్యాయపరంగా, అటు రాజకీయంగా చంద్రబాబుకు ఈ పరిణామం మరింత బలాన్ని చేకూర్చిందంటున్నారు పరిశీలకులు.
http://www.teluguone.com/news/content/former-mla-alla-ramakrishna-reddy-petitions-dismissed-36-216404.html





