Publish Date:Jul 24, 2024
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవయ్యాయని ఆరోపిస్తూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హస్తిన వేదికగా ధర్నా చేస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు, చేసిన విమర్శలూ అన్నీ వైసీపీ పాలననే గుర్తుకు తెచ్చాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఐదేళ్ల పాలనలో జగన్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులను సృష్టించారనీ, తన ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన వారిపై వేధింపులు, అక్రమ కేసులు, దాడులు హత్యలు నిత్యకృత్యంగా మారాయి. అయితే తన హాయంలో జరిగిన విధ్వంసం, హింసను ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమికి ఆపాదిస్తూ జగన్ హస్తిన వేదికగా హై డ్రామా ఆడుతున్నట్లు కనిపిస్తోంది. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఉక్కు పాదంతో తొక్కిన జగన్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ హక్కులను అణిచివేశారు.
జగన్ హయాంలో ప్రభుత్వ వేధింపులకు గురి కాని వర్గం రాష్ట్రంలో లేదంటే అతిశయోక్తి కాదు. సామానుల నుంచి విపక్ష నేతల వరకూ అందరినీ వేధించారు. అక్రమ కేసులు బనాయించారు. సొంత పార్టీ రెబల్ ఎంపీ అయిన రఘురామకృష్ణం రాజును కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారు. పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనను అడ్డుకున్నారు. ఆయనను తన హోటల్ రూం నుంచే బయటకు కదలనీయకుండా నిర్బంధించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును అర్ధరాత్రి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అంతులేనన్నిజగన్ హయాంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు అంతులేనన్ని ఉన్నాయి. అటువంటి జగన్ ఇప్పుడు తెలుగుదేశం హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తూ హస్తిన వేదికగా ధర్నాకు దిగారు.
అయితే ఆయన ఆందోళనకు సొంత పార్టీ నుంచే మద్దతు కరవైంది. ఆయన పిలుపును ఇసుమంతైనా పట్టించుకోకుండా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు హస్తిన ధర్నాకు డుమ్మా కొట్టి మండలి సమావేశాలకు హాజరయ్యారు. ఓ వైపు ఆయన హస్తినలో ధర్నా చేస్తున్న సమయంలోనే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య వైసీపీకి రాజీనామా చేశారు. జగన్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు భేషుగ్గా ఉన్నాయనీ, తమ పార్టీ అధినేత చెబుతున్నదాంట్లో ఇసుమంతైనా వాస్తవం లేదనీ ఢిల్లీ ధర్నాకు డుమ్మా కొట్టిన ఇద్దరు ఎమ్మెల్సీలు, ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ చెప్పకనే చెప్పేశారని భావించవచ్చు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-mla--kilari-rosayya-resign-ycp-39-181414.html
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.