వైసీపీకి మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య రాజీనామా
Publish Date:Jul 24, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవయ్యాయని ఆరోపిస్తూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హస్తిన వేదికగా ధర్నా చేస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు, చేసిన విమర్శలూ అన్నీ వైసీపీ పాలననే గుర్తుకు తెచ్చాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఐదేళ్ల పాలనలో జగన్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులను సృష్టించారనీ, తన ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన వారిపై వేధింపులు, అక్రమ కేసులు, దాడులు హత్యలు నిత్యకృత్యంగా మారాయి. అయితే తన హాయంలో జరిగిన విధ్వంసం, హింసను ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమికి ఆపాదిస్తూ జగన్ హస్తిన వేదికగా హై డ్రామా ఆడుతున్నట్లు కనిపిస్తోంది. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఉక్కు పాదంతో తొక్కిన జగన్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ హక్కులను అణిచివేశారు. జగన్ హయాంలో ప్రభుత్వ వేధింపులకు గురి కాని వర్గం రాష్ట్రంలో లేదంటే అతిశయోక్తి కాదు. సామానుల నుంచి విపక్ష నేతల వరకూ అందరినీ వేధించారు. అక్రమ కేసులు బనాయించారు. సొంత పార్టీ రెబల్ ఎంపీ అయిన రఘురామకృష్ణం రాజును కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారు. పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనను అడ్డుకున్నారు. ఆయనను తన హోటల్ రూం నుంచే బయటకు కదలనీయకుండా నిర్బంధించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును అర్ధరాత్రి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అంతులేనన్నిజగన్ హయాంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు అంతులేనన్ని ఉన్నాయి. అటువంటి జగన్ ఇప్పుడు తెలుగుదేశం హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తూ హస్తిన వేదికగా ధర్నాకు దిగారు. అయితే ఆయన ఆందోళనకు సొంత పార్టీ నుంచే మద్దతు కరవైంది. ఆయన పిలుపును ఇసుమంతైనా పట్టించుకోకుండా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు హస్తిన ధర్నాకు డుమ్మా కొట్టి మండలి సమావేశాలకు హాజరయ్యారు. ఓ వైపు ఆయన హస్తినలో ధర్నా చేస్తున్న సమయంలోనే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య వైసీపీకి రాజీనామా చేశారు. జగన్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు భేషుగ్గా ఉన్నాయనీ, తమ పార్టీ అధినేత చెబుతున్నదాంట్లో ఇసుమంతైనా వాస్తవం లేదనీ ఢిల్లీ ధర్నాకు డుమ్మా కొట్టిన ఇద్దరు ఎమ్మెల్సీలు, ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ చెప్పకనే చెప్పేశారని భావించవచ్చు.
http://www.teluguone.com/news/content/former-mla--kilari-rosayya-resign-ycp-25-181415.html





