మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా ఇప్పుడు టెన్షన్ లో ఉన్నారు. తిరుమల వెంకన్న దేవుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతున్నారు. ఆ విషయాన్ని ఆమె స్వయంగా ప్రైవేటు సంభాషణల్లో అదీ.. మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఎదురుగా అన్నట్లు చెబుతున్నారు. ఔను తెలిసి తెలిసీ వేంకటేశ్వరస్వామితో పెట్టుకున్నాం ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని ఆమె అన్న మాటలకు సంబంధించి వీడియో ఒకటి సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ గా మారింది.
వాస్తవానికి రోజా మంత్రిగా ఉన్న సమ యంలో రోజుకు వందలు వేలుగా టీటీడీ దర్శనం టోకెన్లను అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జబర్దస్త్ కమేడియన్ కిరాక్ ఆర్పీ పలు మార్లు ఈ ఆరోపణలు చేశారు. అంతే కాదు.. టీటీడీ చైర్మర్ బీఆర్ నాయుడు కూడా ఆ చిట్టా అంతా తమ దగ్గర ఉందనీ, ఇదో పెద్ద కుంభకోణమనీ చెప్పడమే కాకుండా త్వరలోనే అన్ని విషయాలూ బయటపెడతామన్నారు. ఈ నేపథ్యంలోనే రోజా తెలిసి తెలిసీ వేంకటేశ్వరస్వామితో పెట్టుకున్నాం.. ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అన్న మాటలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయంటున్నారు. రోజా మాటలు వాస్తవమే అయితే ఆమె వేంకటేశ్వరస్వామి విషయంలో తప్పు చేసినట్లు అంగీకరించేసినట్లేనని పరిశీలకులు అంటున్నారు.
అయితే విచిత్రమేంటంటే.. అంత భయ పడుతూ కూడా ఎందుకిలా చేశారన్నది ఇప్పుడో చర్చగా మారింది. సింథటిక్ నెయ్యితో స్వామివారికి లడ్డూలు చేసి పెట్టిన పాపం ఊరకే పోలేదనీ, ఇప్పటికే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ ఘోర పరాజయం ఎదుర్కొందనీ అంటున్నారు. ఇక రోజా విషయానికి వస్తే.. ఆమెకు తిరుమల వెంకటేశ్వరస్వామిపై ఎంత భక్తి ఉందో.. అలాగే కొల్హాపూర్ మహాలక్ష్మీ అమ్మవారిపైనా అంత భక్తి ఉంది. తరచూ ఆమె తిరుమల వెంకన్న స్వామివారిని, కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారినీ దర్శించుకుంటూ ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా ఈ దర్శనాలను మాత్రం ఆమె మానరు. మధ్యమధ్యలో కాశీ కూడా వెళ్లి వస్తుంటారు. పాపం చేశాను.. పరిహారం చూపండి అనో ఏమో రోజా ఈ దేవుళ్లను క్రమం తప్పకుండా దర్శించుకుని వస్తుంటారు.
అవన్నీ పక్కన పెడితే వైసీపీలో రోజా కు ఏ మంత ప్రాముఖ్యత కనిపించడం లేదు. సోంత నియోజకవర్గం నగరిలో స్థానిక వైసీపీ నేతలు ఆమెపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. సో..వచ్చే ఎన్నికలలో ఆమెకు వైసీపీ టికెట్ దక్కకుండా వారు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయవర్గాలలో చర్చ నడుస్తోంది. ఇక ఏపీలో లాభం లేదు తమిళనాడు వెళ్లిపోయి.. టీవీకేలో సెటిల్ అవ్వడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ఇసుమంతైనా ఫలించలేదంటున్నారు. మరిప్పుడు గత్యంతరం లేక వైసీపీలో గుర్తింపు కోసం చంద్రబాబును భల్లాల దేవుడు, జగన్ ను బాహుబలి అంటూ సినిమా డైలాగులతో రాజకీయం చేస్తున్నారని నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-minister-roja-tenssion-39-213642.html
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్‌బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
Publish Date:Aug 31, 2026
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న రాజకీయ సమీకరణాలపై చర్చోపచర్చలు మొదలయ్యాయి.