బీజేపీకి రావెల రాజీనామా.. మళ్లీ తెలుగుదేశం గూటికి మాజీ మంత్రి?
Publish Date:May 16, 2022
Advertisement
మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపించారు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం అనంతరం రావెల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కమలం తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే గత కొద్ది కాలం నుంచి రావెల బీజేపీలో క్రియాశీలంగా వ్యవహరించడం లేదు. గత నెలలో చంద్రబాబు గుంటూరు పర్యటన సందర్భంగా ఆయనతో భేటీ అయ్యారు. అప్పట్లోనే రావెల కిషోర్ బాబు తెలుగేదేశం గూటికి చేరనున్నారన్న ప్రచారం జరిగింది. తాజాగా ఆయన తన రాజీనామా లేఖను బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపించారు. త్వరలోనే ఆయన తెలుగుదేశం గూటికి చేరతారని విస్తృతంగా ప్రచారం అవుతోంది. దీనిపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. మొత్తం మీద బీజేపీకి రాజీనామా చేసిన రావెల్ తిరిగి సొంత గూటికి చేరడం ఖాయమన్న ప్రచారం రాజకీయ వర్గాలలో విస్తృతంగా సాగుతోంది.
http://www.teluguone.com/news/content/former-minister-rabela-kishore-babu-resigns-bjp-likely-to-join-tdp-25-135950.html





