Publish Date:Oct 21, 2024
మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్ ను పోలీసులు మధురైలో అరెస్టు చేశారు. దళిత యువకుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న పినిపే శ్రీకాంత్ గత కొంత కాలంగా పరారీలో ఉన్నాడు. ఆయనను పోలీసులు మధురైలో గుర్తించి అరెస్టు చేశారు. దళిత యువకుడి హత్య కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
కోనసీమ జిల్లా అయినవిల్లికి చెందిన దళిత యువకుడు జనుపల్లి దుర్గాప్రసాద్ అయినవిల్లి గ్రామంలో వాలంటీర్ గా పని చేసేవాడు. మాజీమంత్రి పినిపే విశ్వరూప్ కు అనుచరుడు. అదే క్రమంలో పినిపే శ్రీకాంత్ కు సన్నిహితుడిగా మారాడు. ఇటీవలి ఎన్నికలలో పి. గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పినిపే శ్రీకాంత్ ప్రయత్నాలు చేశారు.
ఆ క్రమంలో పినిపే శ్రీకాంత్ కు అన్ని విధాలుగా జనుపల్లి దుర్గాప్రసాద్ సహాయ సహకారాలు అందించారు. కాగా ఆ క్రమంలో కోనసీమకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయడంపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అయ్యింది. అప్పట్లో ఆ ఆందోళన హింసాకాండకు దారి తీసింది. ప్రధానంగా కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు హింసాకాండ చెలరేగింది. ఆ అల్లర్లలో పినిపే విశ్వరూప్ ఇంటిని ఆందోళన కారులు ధ్వంసం చేశారు. ఆ సమయంలో దాదాపు నెల రోజుల పాటు అమలాపురం వ్యాప్తంగా ఆంక్షలు అమలులో ఉన్నాయి. కర్ఫ్యూ కూడా విధించారు.
ఆ సమయంలోనే అంటే 2022 జూన్ 6న జనుపల్లి దుర్గాప్రసాద్ అదృశ్యమయ్యారు. అతడి మృతదేహం అదే నెల 10 ముక్తేశ్వరం రేవు వద్ద అభించింది. అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లతో దర్యాప్తును సాగించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటికి పినిపే విశ్వరూప్ మంత్రిగా కూడా ఉండటంతో ఈ కేసును పోలీసులు నీరుగార్చారన్న విమర్శలూ వెల్లువెత్తాయి.
ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. విచారణలో భాగంగా మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడి ప్రమేయం ఉందని వెల్లడి కావడంతో పోలీసులు పినిపే శ్రీకాంత్ ను ఈ కేసులో ఏ1గా చేర్చారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన ధర్మేష్ అనే యువకుడు విచారణఏలో పినిపే శ్రీకాంత్ ఆదేశాల మేరకు జనుపల్లి దుర్గా ప్రసాద్ హత్య జరిగిందని వెల్లడి కావడంతో శ్రీకాంత్ కోసం గాలింపు చేపట్టారు. పరారీలో ఉన్న శ్రీకాంత్ మధురైలో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-minister-pinipe-viswaroop-son-srikanth-arrest-25-187124.html
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.