వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ అజ్ణాతంలోకి వెళ్లారా అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది. మాజీ మంత్రి నారా లోకేష్, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జోగి రమేష్ పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అరెస్టు భయంతో ఆయన అజ్ణాతంలోకి వెళ్లారని తెలుస్తోంది. నిన్న రాత్రి నుంచీ ఆయన ఫోన్ లో కూడా అందుబాటులోకి రాకపోవడంతో ఆయన అజ్ణాతంలోకి వెళ్లారని పోలీసులు కూడా భావిస్తున్నారు. విషయమేంటంటే..జోగి రమేష్ లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులు ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసాన్ని ముట్టడించారు.
ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు. నిప్పు పెట్టారు. జోగి రమేష్ క్షమాపణ చెప్పే వరకూ అక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపు చేశారు. ఇది జరిగిన తరువాత జోగి రమేష్ ఆదివారం (ఫిబ్రవరి 1) రాత్రి తిరుపతి నుంచి తన నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయనను పరామర్శించడానికి మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు జోగి రమేష్ నివాసానికి వచ్చారు. ఆ తరువాత ఇరువురూ కలిసి జోగి రమేష్ కుమారుడిని కూడా తీసుకుని బయటకు వెళ్లారు. ఆ తరువాత నుంచీ జోగి రమేష్ ఎవరికీ అందుబాటులోకి రాలేదు. చివరికి ఫోన్ లో కూడా అందుబాటులో లేకపోవడంతో అరెస్టు భయంతో ఆయన అజ్ణాతంలోకి వెళ్లారని అంటున్నారు.
అసలింతకీ జోగి రమేష్ అరెస్టు భయంతో అజ్ణాతంలోకి వెళ్లడానికి కారణం ఏమిటంటే.. నారా లోకేష్ పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసే కారణమంటున్నారు. ఆ కేసులో అనుచిత వ్యాఖ్యలే కాకుండా, జోగి రమేష్ కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారనీ, శాంతి భద్రతలకు భంగం కలిగే వ్యాఖ్యలు చేశారనీ పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో అరెస్టైతే బెయిలు దొరకడం కష్టమని భావించే జోగి రమేష్ అజ్ణాతంలోకి వెళ్లారని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-minister-jogi-ramasesh-has-gone-under-ground-39-213390.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!