మాజీమంత్రి అంజద్ బాషా సోదరుడు అరెస్ట్
Publish Date:Apr 6, 2025
Advertisement
వైకాపా నేత , మాజీమంత్రి అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా అరెస్ట్ అయ్యారు. అహ్మద్ బాషాపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారి అయిన సంగతి తెలిసిందే. కడపలో ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే అహ్మద్ భాషాపై లుకౌట్ నోటీసులు జారి అయ్యాయి. అహ్మద్ భాషా కువైట్ పారి పోవడానికి ప్రయత్నిస్తుండగా అనూహ్యంగా ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని కడప పోలీసులకు అప్పగించారు. కడపలోని వినాయక నగర్ స్థలంలో వివాదంలో అహ్మద్ భాషాపై కేసు నమోదైంది. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి శ్రీనివాస్ రెడ్డిని దూషించిన కేసులో అహ్మద్ భాషా నిందితుడు. అహ్మద్ భాషాను సోమవారం(ఏప్రిల్ 7) కడప కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-minister-anjad-bhasha--brother-arrested-25-195715.html
http://www.teluguone.com/news/content/former-minister-anjad-bhasha--brother-arrested-25-195715.html
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026





