Publish Date:Jun 30, 2022
కొన్ని సంఘటనలు ఇబ్బంది పెడతాయి. కొన్ని స్వయంకృతాలూ జీవితాన్నే తారుమారు చేస్తాయి. మాజీ మంత్రి అనీల్ ది రెండవ రకం. మాజీ మంత్రిగా అయినా అందరితో మంచిగా వుండాల్సినవారు హఠా త్తుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. మరి ఎప్పుడు తిరిగివస్తారు, నెల్లూరు సిటీలో పోటీ చేస్తారా లేదా అన్నది నెల్లూరు జిల్లాలో పెద్ద చర్చ. మంత్రి పదవి పోయిన తర్వాత ఏమయిందో ఏమో ఫ్లెక్సీల గొడవ తో పార్టీ పెద్దల ఆగ్రహానికి గురయ్యారు.
ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళిపోయారు. అనీల్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ అంటే పడి చచ్చేంత వీరాభిమాని. ఆ విషయం రుజువు చేసుకోవడానికి తుపాకీ ధరించి అతిగా వ్యవహరించారు. ప్రభుత్వం ఏర్పడే వరకూ నచ్చిన ఆయన ప్రవర్తన ఆ తర్వాత పార్టీ పెద్దలకూ నచ్చలేదు. ఆయన అతి ప్రవర్తన ప్రతిపక్షాలతోపాటు అధికారపక్షంవారికి విసుగెత్తించింది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం వర్గంవారికి అనిల్ వైఖరి బొత్తిగా నచ్చలేదు. అనీల్ మంత్రి పదవి పోయిన తర్వాత అందరూ ఆయన్ను టార్గెట్ చేయడం తో మద్రాసుకు మకాం మార్చారు.
అసలే పరిస్థితులు అనుకూలించకపోవడంతోపాటు ఆనం, కాకాణివర్గం ఒకటి కావడం అనిల్ కు ఇబ్బందికరంగా మారింది. దీనితో అనీల్ ఆనం రామనారాయణ రెడ్డి సోదరుడు విజయకుమార్ రెడ్డితో జతకట్టారు. నెల్లూ రులో ఆనం మద్దతు వుంటే దేన్నయినా సాధించవచ్చని అనీల్ నమ్మకం. నెల్లూరు సిటీలో గెలవవచ్చ ని పావులు కదిపారు. కాకాణి గోవర్దన్బరెడ్డి మంత్రి అయ్యాక అనిల్ కు ఊహించని పరిణామాలు ఎదుర య్యాయి. అనం , కాకాణి వర్గం ఒకటి కావడం అనిల్ కు చెక్ పెట్టడం చకచకా జరిగిపోయాయి.
ఈ విషయమై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండి పడ్డా రు. అనిల్ తో స్నేహం కటాఫ్ చేసి తన నియోజకవర్గం లొ ఎవరైనా తలదూరిస్తే తాను కూడా అన్నీ నియో జకవర్గం లొ కాలు పెట్టాల్సి వస్తుందని మీడియా సమావేశం పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈ వార్నింగ్ అనీల్ తో పాటు మరి కొందరికి కుడా తగిలేలా చెప్పాడు దీంతో అనిల్ ఉక్కిరి బిక్కిరి అవుతు న్నాడట.
ఆమద్య ప్లినరీ సమావేశా నికి వచ్చిన అనిల్ తాను వెంకటగిరి నుంచి పోటీ చేస్తానని ప్రచారం జరుగోతోందనీ, అది అవాస్తవమని తాను నెల్లూరు సిటీ నుంచే పొటీ చెస్తున్నట్టు ప్రకటించుకొని మళ్లీ వెళ్లి పొయాడు. అనీల్ అజ్ఞాతం లోకి వెళ్ళడానికి అసలు కారణాలేమిటన్నది పార్టీవర్గాలకీ ఇదమిథ్థంగా తెలియడంలేదు. ఎందుకంటే అనీల్ మంత్రి పదవి పోయిన తర్వాత ఆయన్ను పెద్దగా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మరో వంక ఏపీ ముఖ్యమంత్రి కూడా అనీల్ సంగతి పట్టించుకోవడం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-minister-anil-in-underground-39-138773.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.