వైసీపీకి మాజీ హోంమంత్రి సుచరిత గుడ్ బై.. పార్టీలో ఎవరైనా మిగులుతారా?

Publish Date:Oct 23, 2024

Advertisement

వైఎస్ తరచూ చెప్పే దేవుడి స్క్రిప్ట్ అంటే అర్ధం ఏమిటో ఇప్పుడిప్పుడే  జగన్ కు తెలుస్తోంది. అధికారం ఉందన్న అహంకారంతో అరాచకాలకు, దౌర్జన్యాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే కర్మ అనుభవించక తప్పదని అవగతమౌతోంది. జగన్ తో అంటకాగి, ఆయన కళ్లల్లో ఆనందం చూడటానికీ, ఆయన దృష్టిలో పడటానికీ ఇష్టారీతిగా వ్యవహరించి, అడ్డగోలుగా ప్రత్యర్థులపై అనుచిత విమర్శలు చేసి, దూషణలకు పాల్పడిన ఒక్కొక్కరికీ ఇప్పుడు బొమ్మ కనబడుతోంది. కాళ్ల కింద భూమి కదిలిపోతోంది. నోరెత్తడానికే భయంతో వణికి పోతున్న పరిస్థితి. 

ఇటీవలి ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని, పరాభవాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కనీసం విపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 స్థానాలతో ఆ పార్టీ దయనీయంగా మిగిలింది. ఈ ఓటమి తరువాత ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా జగన్ తీరును విమర్శిస్తూ, తమ రాజకీయ భవిష్యత్ ను వెతుక్కుంటూ వైసీపీని వీడుతున్నారు. ఎన్నికలలో పరాజయం తరువాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మొదలైన వలసన పరంపర ఇప్పుడు ఉధృతమైంది. ఆ పార్టీలో జగన్ వినా ఎవరైనా ఉంటారా అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయంటూ జగన్ కు దూరం అవుతున్న వైసీపీ నేతల సంఖ్య ఎంత పెద్దగా ఉందో అర్ధమౌతుంది. ఇప్పటికే వైసీపీ క్యాడర్ చెల్లా చెదురైపోయింది. ఆ పార్టీ ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే కదలి వచ్చే కార్యకర్తలు కరవయ్యారు. 
ఇక వైసీపీని వీడుతున్న నేతలలో పార్టీ అధికారంలో ఉన్నంత కాలం అత్యంత కీలకంగా వ్యవహరిం చిన, జగన్ కు అత్యంత ఆప్తులుగా గుర్తింపు పొందిన, నమ్మిన బంట్లుగా వ్యవహరించిన వారే ముందు వరుసలో ఉండటం ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తోంది.

 జగన్ కు సమీప బంధువు, ఆయనకు వరుసకు మామ అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మొదలైన ఈ వలసలు విరామం లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. బాలినేని కంటే ముందు కిలారు రోశయ్య వైసీపీని వీడారు. ఇక ఆ వరుసలో  సామినేని ఉదయబాను.. మోపిదేవి, బీదం మస్తానరావు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా కొండవీటి చాంతాడును మించిపోయేంత పొడుగు ఉంటుంది. తాజాగా బుధవారం మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపారు. ఆ సందర్భంగా ఆమె  నేరుగా జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జగన్ కు బాధ్యత లేదనీ, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి లేదనీ, రాజకీయం అంటే ఆయనకు వ్యాపారమనీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఇప్పుుడు పార్టీ మారుతున్న వారి జాబితాలోకి మరో పేరు వచ్చి చేరింది. మాజీ మంత్రి మేకతోటి సుచరిత వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. 

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సుచరిత రాజకీయాలకు కొత్తే అయినా.. జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలగిన నేతల్లో  ఆమె ఒకరు.  జగన్ సీఎం కాగానే.. సుచరితకు హోంమంత్రి పదవి కట్టబెట్టారు.  అయితే  సజ్జలతో విభేదాల కారణంగా జగన్ తన కేబినెట్ ను విస్తరించిన సమయంలో ఆమె మంత్రి పదవి కోల్పోయారు. అప్పటి నుంచీ అసంతృప్తితోనే ఉన్న సుచరిత.. ఆ సమయంలో జగన్ పై, సజ్జలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.  జగన్ స్వయంగా పిలిచి బుజ్జగించడంతో అయిష్టంగానే పార్టీలో కొనసాగిన మేకతోటి సుచరిత.. ఇక ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పార్టీ మారడానికే నిర్ణయించుకున్నారని ఆమె వర్గీయులు చెబుతున్నారు.  

By
en-us Political News

  
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.