పొన్నవోలుకు ఆ అర్హత లేదు!
Publish Date:Aug 1, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తనకు అదనపు భద్రత కల్పించాలంటూ పొన్నవోలు దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్టు తోసి పుచ్చింది. పొన్నవోలు పిటిషన్ పై గురువారం (ఆగస్టు1)న హైకోర్టులో విచారణ జరిగింది. ఆ సందర్భంగా హైకోర్టు పోలీసు భద్రతకు పొన్నవోలుకు అర్హత లేదని పేర్కొంది. రాజ్యాంగ, చట్టబద్ధ పదవులు నిర్వహించడం భద్రతకు అర్హత కాదని స్పష్టం చేసింది. ఎలాంటి ప్రాణహానీ లేదని సెక్యూరిటీ రివ్యూ కమిటీ కూడా నిర్ధారించిందని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నివేదికపై ఏమైనా అభ్యంతరాలుంటే సవాల్ చేసుకోవచ్చని పేర్కొన్న హైకోర్టు ప్రాణహాని ఉందని నిర్ధారణ జరిగి, ప్రభుత్వం భద్రత కల్పిస్తే ఆ ఖర్చు పొన్నవోలే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
http://www.teluguone.com/news/content/former-aag-ponnavolu-no--eligibility-for-security-25-182057.html





