FlyDubai Pilot attack: వెనుక ఇరాన్ హస్తం..డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్.!

Publish Date:Oct 2, 2026

Advertisement

దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన వెనుక ఇరాన్ హస్తం ఉండొచ్చంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పశ్చిమాసియా రాజకీయాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తతలను పెంచాయి.దుబాయ్ నుంచి బయలుదేరిన విమానం గాల్లో ఉండగా, ఒమన్ జాతీయుడిగా గుర్తించిన కో-పైలట్ అకస్మాత్తుగా కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై కత్తితో విరుచుకుపడ్డాడు. ఈ ఊహించని పరిణామానికి విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు ఒక్కసారిగా హడలిపోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ కెప్టెన్ స్మిత్ అత్యంత ధైర్యంగా నిందితుడిని ప్రతిఘటించారు.ప్రయాణికులు, ఇతర సిబ్బంది సకాలంలో స్పందించి దాడికి పాల్పడిన కో-పైలట్‌ను చాకచక్యంగా పట్టుకుని బంధించారు. ఆ తర్వాత విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ నగరంలో అత్యవసరంగా  సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. 

ఈ ఘటనపై ప్రస్తుతం వివిధ దేశాల నిఘా వర్గాలు లోతైన దర్యాప్తును వేగవంతం చేశాయి.ఈ దాడిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు గుప్పించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ దారుణం వెనుక ఇరాన్ ప్రమేయం ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌కు చెందిన 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (ఐఆర్‌జీసీ) ఈ కో-పైలట్‌ను రాడికలైజ్ చేసి విమానంలోకి పంపి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం ఈ అంశంపై ఆచితూచి స్పందించారు. ఇప్పుడే ఇరాన్ ప్రమేయం ఉందని ఒక నిర్ధారణకు రావడం తొందరపాటే అవుతుందని, పూర్తి స్థాయి దర్యాప్తు ముగిసే వరకు వేచి చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, దాడికి పాల్పడిన కో-పైలట్ మాత్రం ఇస్లామిస్ట్ రాడికలైజేషన్‌‌కు గురైనట్లు తమ వద్ద బలమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

అబ్రహం ఒప్పందాల ద్వారా ఇజ్రాయెల్, యూఏఈ మధ్య సంబంధాలు క్రమంగా బలపడుతున్న తరుణంలో ఈ తరహా ఘటన జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కో-పైలట్ వ్యక్తిగత నేపథ్యం, అతని కదలికలపై నిపుణులు తీవ్రంగా కూపీ లాగుతున్నారు. త్వరలోనే ఈ కుట్ర వెనుక అసలు నిజాలు బయటపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ ఘటన నేపథ్యంలో అంతర్జాతీయ విమానయాన భద్రతపై ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ముప్పులను ముందే పసిగట్టేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలు మరింత కఠినమైన భద్రతా నిబంధనలను అమలు చేసే అవకాశం ఉంది. 


దర్యాప్తు తుది నివేదిక వెలువడిన తర్వాత పశ్చిమాసియాలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.నిందితుడైన ఒమన్ కోపైలట్‌ను తమ దేశానికి అప్పగించాలని ఇజ్రాయెల్ గట్టిగా పట్టుబడుతున్నప్పటికీ, దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. నిందితుడు ఇస్లామిక్ భావజాలంతో తీవ్రవాద ప్రేరేపణకు గురయ్యాడని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గట్టిగా ఆరోపిస్తున్నారు. ఒమన్‌కు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేకపోయినా, ఇజ్రాయెల్ వైమానిక నిబంధనల్లోని లూప్‌హోల్స్‌ను ఆసరాగా చేసుకుని ఆ కోపైలట్ విమానంలో ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు, హమాస్ దాడికి రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో ఈ ఘటన మళ్లీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తారాస్థాయికి చేర్చింది. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు జరుగుతుండగానే, మరోవైపు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ఘాటు హెచ్చరికలు ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తున్నాయి.

 

 

 


[ Flydubai flight incident, Donald Trump warning, Iran plane crash link, Israel bound flight, pilot attack conspiracy, Middle East tension, Iran IRGC, Smith Machhar, Benjamin Netanyahu, Dubai Tel Aviv flight ]

By
en-us Political News

  
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్‌ నియోపోలిస్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.