న్యూయార్క్ నగరంలో వరద బీభత్సం
Publish Date:Aug 2, 2025
Advertisement
అమెరికా తూర్పు తీరంలో భారీ వర్షాలు, వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసేశాయి. ముఖ్యంగా న్యూయార్క్ నగరం భారీ వర్షాలు, వరదల కారణంగా కొన్ని గంటల పాటు అతలాకుతలమైపోయింది. నగరం చిగురుటాకులా వణికిపోయింది. రోడ్లు జలమయమయ్యాయి. రైల్వే స్టేషన్లు, భవనాలలోకి వరద నీరు ప్రవేశించడంతో జనం నానా ఇబ్బందులూ పడ్డారు. భారీ వర్షం కారణంగా రైలు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల నీటిలో చిక్కుకుపోయిన వాహనదారులను రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఒక ప్యాసింజర్ రైలులో నీరు ప్రవేశించడంతో అందులోని ప్రయాణికులను అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బయటకు తరలించాల్సి వచ్చింది. న్యూయార్క్ నగరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటిం చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/flood-havoc-in-newyork-39-203319.html
http://www.teluguone.com/news/content/flood-havoc-in-newyork-39-203319.html
Publish Date:Dec 30, 2025
Publish Date:Dec 30, 2025
Publish Date:Dec 30, 2025
Publish Date:Dec 29, 2025
Publish Date:Dec 29, 2025
Publish Date:Dec 29, 2025
Publish Date:Dec 29, 2025
Publish Date:Dec 29, 2025
Publish Date:Dec 29, 2025
Publish Date:Dec 29, 2025
Publish Date:Dec 28, 2025
Publish Date:Dec 28, 2025
Publish Date:Dec 28, 2025





