వ‌రంగ‌ల్‌లో ఫెక్సీల ర‌గ‌డ‌.. హ‌న్మ‌కొండ‌లో బండి సమావేశం

Publish Date:Aug 27, 2022

Advertisement

వరంగల్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఫ్లెక్సీల రగడ మళ్లీ మొద లైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు స్వాగతం పలుకుతూ బీజేపీ కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు సంఘటనా స్థలంలో ఆందోళన చేస్తున్నారు. ఫ్లెక్సీల చించివేత టీఆర్ఎస్ పనేనంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వరంగల్ లో హై టెన్షన్ వాతావరణం నెల కొంది. ఆందోళన చేస్తున్న పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మూడ‌వ విడ‌త ప్ర‌జాసంగ్రామ యాత్ర ముగింపు సంద‌ర్భంగా హ‌న్మ‌కొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ప్ర‌త్యేక స‌భ జ‌ర‌గ‌నుంది. దీనికి బీజేపీజాతీయ అద్య‌క్షుడు న‌డ్డాతో పాటు ముఖ్య‌నేత‌లు హాజ‌రుకానున్నారు.  జనగామ జిల్లా పాంనూర్‌ వద్ద బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ప్రజాసంగ్రామ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. మూడు రోజుల విరామం తర్వాత హైకోర్టు అనుమతితో యాత్ర ఆగిన చోట నుంచే తిరిగి మొదలైంది. 

ఈ క్రమంలోనే వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధిస్తూ సీపీ తరుణ్‌జోషి ఉత్తర్వులను జారీ చేయడం, ఆర్ట్స్‌ కళాశాలలో సభ నిర్వహణకు ప్రిన్సిపాల్‌ అనుమతి నిరాకరించడంతో.. బీజేపీ బహిరంగ సభ నిర్వహణపైనా అనిశ్చితి నెలకొన్నది. అయితే, బీజేపీ నేతలు హై కోర్టును ఆశ్రయించి.. సభకు అనుమతి సాధించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. కళాశాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సభా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవా లని సూచించింది. దీంతో బీజేపీ నాయకత్వం రెట్టించిన ఉత్సాహంతో ఏర్పాట్లు చేస్తోంది. ప్రతిష్ఠాత్మ కంగా సభహనుమకొండలో నిర్వహించనున్న బహిరంగ సభకు బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈనెల 21న  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటించి రాష్ట్రంలో రాజకీయ అలజడికి తెరలేపగా, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేపీ నడ్డా ఎలాంటి కీలక సందేశం పార్టీ శ్రేణులకు ఇవ్వబోతున్నార న్నది ఆసక్తికరంగా మారింది. 

 ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల ముఖ్యనేతలతోపాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, పలువురు సీనియర్‌ నాయకులతో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్‌చార్జిగా నియమితులైన సునీల్‌ బన్సల్‌ శుక్రవారమే వరంగల్‌ చేరుకున్నారు. బన్సల్‌తో పాటు పార్టీ రాష్ట్ర మరో ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ తదితర సీనియర్‌ నేతలు ఈ బహిరంగసభలో పాల్గొననున్నారు

By
en-us Political News

  
అధికారం కోసం ఈ వైసీపీ పిశాచాలు అశుద్ధ భక్షణకు కూడా రెడీ అయ్యేట్టున్నాయి. చేజారిపోబోతున్న అధికారాన్ని మళ్ళీ ఎలాగైనా దక్కించుకుని, రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయాలన్న ఉద్దేశంతో వైసీపీ నాయకులు పాతాళానికి దిగజారిపోతున్నారు.
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలో  అశేష జనవాహిని మధ్య పెనుకొండ తెలుగుదేశం అభ్యర్థి శ్రీమతి సవితమ్మ
జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని చంపిస్తాడా? అవునని అంటున్నాడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి.
తాను, తన భార్య ఒకే గదిలో ఉండటం లేదని చెప్పారు. కండోమ్‌ లేకుండానే ట్రంప్‌ నాతో శృంగారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో నా వయసు 27 ఏళ్లు.. ట్రంప్‌ వయసు నా తండ్రి కంటే ఎక్కువ ఉంటుందేమో’’ అంటూ వివరంగా ఆ రోజు ఏం జరిగిందో 45 ఏళ్ల స్టార్మీ డేనియల్స్‌ చెప్పారు.
జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దంటూ సీబీఐ గట్టిగా అభ్యంతరం చెప్పింది. ఎన్నికలు పూర్తి కాగానే కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు అనుమతించాలంటూ జగన్ సీబీఐ కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే.
జగన్ సామ్రాజ్యంగా చెప్పుకునే కడప లోక్ సభ స్థానంలో ఈ సారి ఆయన పార్టీ మూడో స్థానానికే పరిమితం కానుందా? అంటే స్థానికులు ఔననే అంటున్నారు. ఈ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల రంగంలోకి దిగడంతోటే ఇక్కడ వైసీపీ గ్రాఫ్ దిగజారడం ఆరంభమైంది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రచార పర్వం ఈ శనివారం (మే 11) సాయంత్రంతో ముగియనుంది. అంటే నిండా మూడు రోజుల వ్యవధి కూడా లేదు. ఈ దశలో రాష్ట్రంలో ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా సీని పరిశ్రమ వారు రంగంలోకి దిగి పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచార రంగంలోకి దూకడంతో అక్కడి వాతావరణం సందడిగా మారిపోయింది.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అమ‌రావ‌తిపై, పగబట్టినట్టుగానే పోలవరంపై కూడా పగబట్టారు. ఆ పనులను నిలిపివేయించారు. కాంట్రాక్టర్లను బెదిరించి పక్కకు తప్పించారు. రివర్స్ టెండర్లు అంటూ పెద్ద డ్రామా నడిపించి.. తమకు అత్యంత దగ్గరివారైన మేఘా కంపెనీకి కాంట్రాక్టును కట్టబెట్టారు. రివర్స్ టెండరింగ్ వ్యవహారం ద్వారా ఇన్ని కోట్ల రూపాయలు ఆదా చేశామంటూ మాయమాటలు వల్లించారు. అప్పటి నుంచి పోలవరం పనులు పూర్తిగా పడకేశాయి.
చింతమనేని విజయం ఖాయమని స్థానికులు అనుకుంటున్నారు. ఈ సారి, లండన్ బాబును లండన్ పంపించి, తనకు ప్రజలు నలభై వేల మెజార్టీ ఇస్తారని నమ్మకంతో చింత‌మ‌నేని ఉన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.
ఈ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో జగన్ చెబుతున్న అబద్ధాలు విని జనం చీదరించుకుంటున్నారు. వీటికంటే ఎక్కువ ఇరిటేషన్ కలిగిస్తున్న అంశం..
ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఒక్క‌సారికూడా మీడియా ముందుకు రాలేదు. తెలుగు మీడియా అంటే ఆయ‌న‌కు చిరాకు కాబోలు.. ఛీఛీ నేనా.. తెలుగు మీడియాతో మాట్లాడ‌ట‌మా అన్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయినా నిత్యం కాక‌పోయినా తరచుగా మీడియా స‌మావేశాలు ఏర్పాటుచేసి ప్ర‌భుత్వ విధానాలు, అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌పై వివ‌రిస్తుంటారు.
కొట్టు సత్యనారాయణ ఏపీ దేవాదాయ శాఖ మంత్రి, తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు. ప్రస్తుతం ఆయన అదే నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.