Publish Date:Jun 29, 2022
హైదరాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ లోని హైటెక్స్ లో వచ్చే నెల 2,3 తేదీలలో జరగనున్న బీజీపీ కార్యకర్గ సమావేశాలకు హాజరౌతున్న నేపథ్యంలో ఫ్లెక్సీ వార్ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే వచ్చే నెల 3న సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు. దీంతో ఈ సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు నిమగ్నమయ్యాయి.
పార్టీ కార్యవర్గ సమావేశాలు, బహిరంగ సభ నేపథ్యంలో జంట నగరాలలో బీజేపీ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. అన్నిటి కంటే ముఖ్యంగా బీజేపీ కార్యాలయం వద్ద టీఆర్ఎస్ పనైపోయిందన్న అర్ధం వచ్చేలా ‘సాలు దొర.. సెలవు దొర’ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఫ్లెక్సీవార్ కు కారణమైందని అంటున్నారు. మోడీ బహిరంగ సభ జరగనున్న సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. వీటిలో ‘ సాలు మోడీ.. సంపకు మోడీ’ అన్న ఫ్లెక్సీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా నల్లధనం వెనక్కి తెప్పించడం సహా, నోట్ల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు, రైతు చట్టాలు, అగ్నిపథ్ వంటి అంశాలను ప్లెక్సీలో ముద్రించారు. ఇవే కాకుండా పలు ఫ్లెక్సీలు కూడా మోదీకి వ్యతిరేకంగా వెలిశాయి. కాగా ఈ హోర్డింగ్ లు, ప్లెక్సీలు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో పోలీసులను మోహరించారు.
బీజేపీ నాయకులు వచ్చి ఆందోళన చేస్తారన్న సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేసింది ఎవరన్నది తెలియకపోయినా, వీటి వెనకున్నది టీఆర్ఎస్సేనని బీజేపీ ఆరోపిస్తోంది. గత రెండు రోజులుగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. ఈ ఫ్లెక్సీ వార్ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒకదాని తీరును మరోటి తప్పుపడుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/flexi-war-between-bjp-and-trs-39-138712.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.