Publish Date:Aug 31, 2022
ఒక బొమ్మ కోసం ఒకమ్మాయి లవర్‌తో గొడవపడి బొమ్మ తెచ్చిస్తేనే నిన్ను పెళ్లాడతానని అంటుంది. వాడు వూరంతా తిరిగి ఓ దుకాణంలో అలాంటిదే కొనిస్తాడు. ఆమె పరిశీలనగా చూసి బొమ్మని పారేసి, సదరు ప్రేమికుడిని ఇక కలవద్దని వారిస్తుంది. కావడానికి ఇదో సినిమా సీన్. కానీ ఆ బొమ్మకి ఆ అమ్మాయికి ఉన్నఅనుబంధం గట్టిదే. అది తాను టెన్త్‌లో ఉండగా వాళ్ల డాడీ కొనిచ్చాడు. ఆయన చనిపోయిన తర్వాత దాంతోనే ఎక్కువ మాట్లాడుతూండేది. అదో బంధం. అది అందరికీ అర్ధమయ్యేది కాదు. దానితో మాట్లాడుతూంటే తండ్రితో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఇదో సెంటిమెంటు కూడా. అందువల్ల అలాంటి వస్తు వులు ఎవరూ వదులుకోరు, పారేసుకోరు. ప్రాణంతో సమానంగా చూసుకునే బ్రాస్‌లెట్ పోగొట్టుకున్న కుర్రాడు మరెంతగా బాధ పడుతున్నాడో. అది తెచ్చిచ్చినవారికి తగిన బహుమతి ఇస్తానని ఏకంగా ఫ్లెక్సీ పెట్టేడు!
తల్లి జ్ఞాపకార్ధం గా ఉంచిన బ్రాస్‌లైట్ కనిపించకుండా పోయిందని, దానిని అందజేసిన వారికి తగిన బహుమతి ఇస్తానంటూ పుదుకోట జిల్లా పొన్నామరావతికి చెందిన నారాయణన్ విజ్ఞప్తి చేస్తున్నాడు. తల్లి కానుకగా ఇచ్చిన బ్రాస్‌లెట్‌ను ఆమె మరణా నంతరం జ్ఞాపకంగా నారాయణన్ ధరిస్తున్నాడు. ఆగష్టు 22వ తేది ఉసిలంపట్టిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొచ్చిన నారా యణన్ బ్రాస్‌లెట్ కనిపించకపోవడంతో దిగ్ర్భాంతి చెందాడు. పలు ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో తాను వెళ్లి వచ్చి న దారిలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశాడు.
అందులో తల్లి జ్ఞాపకంగా ఉన్న బ్రాస్‌లెట్ కనిపించలేదని, అందజేసిన వారికి తగిన బహుమతి అందిస్తానంటూ పేర్కొన్నాడు. ఆ ఫ్లెక్సీ ఉన్న దారంట వెళ్లేవారు ఈసరికే చాలామంది నవ్వుకుని ఉంటారు. నేను ఫలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని లవర్స్ పెట్టుకోవడం చూశాంగాని వీడెవడండీ, పోయిన వస్తువు కోసం ఇలా ప్రచారం చేస్తారా? వెర్రిగాని! అంటూ ఎగతాళిగా నవ్వు కున్నారు కొందరు యువకులు. కానీ అంత ప్రచారం చేస్తున్నాడంటే దాని వెనక ఉన్న అనుబంధ బలం అలాంటిది. తల్లి లేని లోటు తీర్చడం చాలా కష్టం. ఆమె యిచ్చిన బ్రాస్‌లెట్‌తో కాలం గడుపుతున్నవ్యక్తికి అది కూడా దూరమయితే నరక యాతనే. అది చేతికి ఉంటే అమ్మచేతిని పట్టుకుని నడుస్తున్నట్టే ఉంటుంది. ప్లీజ్.. బ్రాస్‌లెట్ దొరికితే ఇచ్చేయండి... అతనికి తల్లిని దరిచేర్చినట్టవుతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/flexi--request-for-lost-bracelet-25-142988.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!