ప్యాలెస్‌ జగన్నాథం..!

Publish Date:Mar 13, 2024

Advertisement

తాడేపల్లిలో ఓ ప్యాలెస్, హైదరాబాద్‌ లోటస్ పాండ్‌లో ఒక ప్యాలెస్, బెంగళూరు ఎయిర్ పోర్టు సమీపంలో యహలంకలో మరో ప్యాలెస్, కడప జిల్లా పులివెందులలో ఇంకో ప్యాలెస్, విశాఖ రిషికొండలో లేటేస్ట్‌గా ఓ ప్యాలెస్  ఇలా ప్యాలెస్ పేర్లు చెప్పగానే అందరికీ చటుక్కన గుర్తుకు వచ్చే పేరు  జగన్.  ఇలా జిల్లాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు చూడకుండా.. నిర్మించిన ప్యాలెస్‌లన్నీంటికి ఒకే ఒక్క యజమాని  వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి  జగన్. ఎకరాలకు ఎకరాల్లో ఈ ప్యాలెస్‌లన్నీ కోట్లాది రూపాయిలు వెచ్చించి మరీ నిర్మించారు.  

అయితే వీటిలో కొన్ని ఆయన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. నిర్మించిన ఫ్యాలెస్‌లు కొన్ని అయితే.. ఆయన గతించిన అనంతరం.. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా తాడేపల్లిలో ఓ ప్యాలెస్‌ నిర్మించారు. తాజాగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన.. రిషి కొండపై ఇంకో ప్యాలెస్ నిర్మించారు. ఆయన ఏ స్థానంలో ఉన్నా అంటే   ముఖ్యమంత్రి కుమారుడిగా ఉన్నా,  ప్రతిపక్ష నేతగా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన స్థాయి మాత్రం  ప్యాలెస్‌లో కింగ్ అన్నట్లుగానే ఉందనే ఓ బలమైన ముద్ర అయితే జనంలో పడిపోయింది. 

రాజధాని అమరావతి ప్రాంతానికి కూత వేటు దూరంలో తాడేపల్లిలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. ప్యాలెస్ నిర్మించుకున్నారని... రాజధాని అమరావతికి మద్దతుగానే ఆయన ఇక్కడ నివాసాన్ని ఏర్పరుచుకుంటున్నారనీ ఆ పార్టీలోని కీలక నేత ఆర్కే రోజాతోపాటు పలువురు నేతలు  అప్పట్లో  ప్రకటించారు.  అయితే జగన్ అధికారంలోకి రావడంతోనే.. మూడు రాజధానుల ప్రకటన చేసి, కార్య నిర్వాహక రాజధాని విశాఖపట్నం అంటూ.. సాగర తీర నగరంలోని రుషి కొండకు బొడి గుండు కొట్టించి మరీ ఆ కొండ మీద వందల కోట్ల రూపాయిల ప్రజా ధనంతో భారీ ప్యాలెస్   నిర్మించారు. 

అయినా రాజు తలుచుకొంటే దెబ్బలకు కొదవా?.. ప్రభువు తలుచుకుంటే ప్యాలెస్‌లకు కొదవా? అన్నట్లుగా  జగన్ వైఖరి ఉందని  జన బాహుళ్యంలో  ఒక అభిప్రాయం అయితే బలంగా వ్యక్తం అవుతోంది. వివిధ వేదికల మీద నుంచి ఆయన చేసే ప్రసంగాలు ఆయన వెనుక ఉన్న బ్యాక్ గ్రౌండ్‌కు ఏ మాత్రం పొంతన లేకుండా ఉంటాయని కూడా జనం నవ్వుకోవడం కద్దు.  ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. పేదలకు పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్దంలో.. అంటూ ఆయన వివిధ సభల్లో  జగన్ తరచు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. పేదలు ఎవరు?.. పెత్తందార్లు ఎవరు? అనే అర్ధాన్ని ముందు ఆయన తెలుసుకొంటే మంచిదని విపక్షాలు ఎద్దేవా చేస్తుంటారు కూడా.

అయినా.. ఉండీ దరిద్రం లేకా దరిద్రం అంటే ఇదే నేమో , ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు... నాలుగు కాదు.. ఏకంగా అయిదు ప్యాలెస్‌లు... అవి కూడా లక్షల కోట్ల రూపాయిల విలువ చేసే ప్యాలెసులు.. ప్రాంతాలకు, రాష్ట్రాలకు అతీతంగా నిర్మితమై ఉన్నాయని.. అవి కూడా ముఖ్య నగరాల్లో ఉన్నాయి. ఒకరికి ఒక ఇల్లు ఉంటుంది. మరికొందరికీ రెండు ఇళ్లు ఉంటాయి.. కానీ ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్‌కు మాత్రం.. ఇలా అయిదు రాజ ప్రసాదాలు ఉన్నాయి.

దేశ ప్రధమ మహిళ భారత రాష్ట్రపతికి దేశ రాజధాని హస్తినలో రాష్ట్రపతి భవన్ పేరుతో ఒక నివాసం ఉంటే.. భరత రాష్ట్రపతికి వేసవి విడిది కేంద్రాలు.. అటు హిమాచల్ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలో ఒకటి.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మరోకటి ఉన్నాయి. అయితే అవి   ప్రభుత్వానివి. కానీ ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్‌కు మాత్రం ప్రాంతానికి ఒకటి .. రాష్ట్రానికి ఒకటి అన్నట్లుగా ప్యాలెస్‌లు ఉన్నాయి. ఆయన పేదరికం గురించి మాట్లాడటమేంటని జనం విస్తుపోతున్నారు.

ఒక సామాన్య కుటుంబానికి ఒక ఇల్లు.. అంటే సింగిల్ బెడ్ రూమ్ లేదా డబుల్ బెడ్ రూమ్ ఉంటే.. ఆ ఇంటిని మేయింటేన్ చేసుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుందని.. వైయస జగన్ మాత్రం ప్యాలెస్‌ల మీద ప్యాలెస్‌లు నిర్మిస్తూ.. వాటి  మెయింటినెన్స్‌కు చేస్తున్న ఖర్చులను ఓ సారి పరిశీలిస్తే.. కళ్లు బైర్లు కమ్మి.. సొమ్మసిల్లి పడిపోవాల్సిందేనని పేర్కొంటున్నారు.  
 
అయినా కష్టించి పని చేస్తేనే.. తిన్న ఆహారం రక్తంలోకి ఇంకుతోందనే విషయాన్ని జమానాలోనే జనం మరిచిపోయారని... అలాంటి వేళ.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని.. ఊళ్లుకు ఊళ్లు కొట్టేస్తూ.... ఇళ్లుకు ఇళ్లు.. కట్టేస్తూ..  ప్యాలెస్‌లకు ప్యాలెస్‌లు నిర్మిస్తుంటే.. ప్రశ్నించేదెవరు? అడ్డగించేదెవరు?  అడ్డు పడేద్దెవరు,  అయినా జగన్ అధికారంలోకి రాగానే.. తన నివాసానికి సీసీ కెమెరాలు, మరమ్మతుల రూపేణా ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా వెచ్చించిన సంగతి అందరికీ తెలిసిందేనని.. ప్రజల చే, ప్రజల కోరకు, ప్రజలే ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య దేశంలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఓ అమాయకుడిలా..  ప్రజా ధనాన్ని ఇలా.. ఇంత నిర్లజ్జగా.. వాడేస్తుంటే.. ఇది తప్పు అని ప్రశ్నించే వారే లేకపోవడంపై సర్వత్రా  అవేదన వ్యక్తమవుతోంది.

By
en-us Political News

  
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.