జగన్ టూర్ బహిష్కరణ.. మత్స్యకారుల సంచలన నిర్ణయం!

Publish Date:Apr 14, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనను బహిష్కరించాలని మత్స్యకారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు  హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.

జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుండి ఇటీవల నాలుగు బోట్లు మాయం అయ్యాయి. గతంలో తమిళనాడుకు చెందిన కొన్ని బోట్లు అక్రమంగా చేపల వేట సాగిస్తుండగా, స్థానిక మత్స్యకారులు వాటిని పట్టుకుని హార్బర్‌లో  ఉంచారు.  అయితే, ఆ బోట్లు అనుమానాస్పద స్థితిలో మాయం కావడంతో మత్స్యకారుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఈ బోట్ల అదృశ్యం వెనుక రాజకీయనేతల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  దీంతో మత్స్యకారులు పొలిటికల్ లీడర్ల పర్యటనలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.  

మత్స్యకారుల ప్రధాన డిమాండ్ ఏమిటంటే, మాయమైన బోట్ల వ్యవహారం పూర్తిగా తేలే వరకు   రాజకీయ పార్టీలకు, వాటి కార్యక్రమాలకు, అలాగే రాజకీయ నేతలకు తాము దూరంగా ఉంటామని కుండబద్దలు కొడుతున్నారు.  తమ సమస్య పరిష్కారం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు రావడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఇటు అధికార కూటమి నాయకులకు, అటు ప్రతిపక్ష వైకాపా నేతలకు కూడా సహకరించకూడదని ఇసకపల్లి, పట్టపుపాలెం గ్రామాల మత్స్యకారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఇప్పుడు  జగన్ జువ్వలదిన్నె పర్యటన ఉంటుందా? రద్దౌతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా మత్స్యకార గ్రామాల్లో  సామాజిక కట్టుబాట్లు చాలా బలంగా ఉంటాయి.  రానున్న రోజుల్లో ఈ బోట్ల వివాదం మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

By
en-us Political News

  
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఉద్దేశించి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రిని "ఆంబోతు" అని సంబోధిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
వైసీపీ హయాంలో  గ్రంథాలయ రంగానికి చెందాల్సిన సెస్ నిధులను ఖజానాకు మళ్లించారని, తమ ప్రభుత్వం రాగానే ఆ నిధులను తిరిగి గ్రంథాలయ బోర్డుకు జమ అయ్యేలా చర్యలు చేపట్టామన్న ఆయన..
రాష్ట్ర బీజేపీలో  అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలే ఈ పరిస్థితికి  కారణమన్నారు.  గతంలో జాతీయ స్థాయిలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత లభించేదని, కానీ ఈసారి ఒక్కరంటే ఒక్క తెలంగాణ నేతకు కూడా జాతీయ కార్యవర్గంలో చోటు లభించకపోవడం పార్టీ రాష్ట్ర నాయకత్వం స్వయంకృతాపరాధమేనని రాజాసింగ్ పేర్కొన్నారు. 
చెన్నైలోని తిరువికా నగర్ అసెంబ్లీ నియోజకవర్గం టీవీకే తరఫున విజయం సాధించిన పల్లవి తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. ప్రజాప్రతినిధిగా    సభకు  బిడ్డతో హాజరుకావడం పట్ల నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గత ప్రభుత్వం జీవోల ద్వారా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24.15 శాతానికి  తగ్గించిందని, ఇందు వల్ల దాదాపు 16 వేల 800 మంది బీసీ నాయకులు తమ రాజకీయ అవకాశాలను, ప్రాతినిధ్యాన్ని కోల్పోయారని చంద్రబాబు వివరించారు.
 ప్రజా సమస్యలపై పోరాడేందుకు కొత్త వేదికను సిద్ధం చేస్తున్నట్లు చెప్పిన విజయసాయి..   ప్రజల తరఫున నిలబడి వారి హక్కుల కోసం ప్రశ్నించే బలమైన గొంతుకగా తాను నూతన పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
తూమాటి మాధవరావు శాసనమండలి కార్యదర్శికి  తన నామినేషన్ పత్రాలను   సమర్పించారు. రాష్ట్ర శాసనమండలిలో  వైసీపీకి సంఖ్యా బలం స్థానం ఉండటంతో..  డిప్యూటీ ఛైర్మన్‌గా ఆయన ఎన్నిక కావడం లాంఛనమే. 
కంగుతిన్న వైసీపీ అసెంబ్లీలో లోకేష్ ప్రసంగంపై ప్రజలలో చర్చ జరగకుండ ఉండేందుకు మండలి వేదికగా బొత్స పెద్ద డ్రామాకు తెరతీసి.. అచ్చెన్నాయుడు తనను అవమానించారు, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నించారన్నారు. 
మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్, వారి కుటుంబ సభ్యులపై  జోగి రాజీవ్ భార్య  మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వరకట్న వేధింపులు, గృహహింస, మతమార్పిడి ఒత్తిళ్లు అంటూ మేఘన  ఫిర్యాదు మేరకు 11 మంది పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
నిబంధనల ప్రకారం భర్తీ చేయాల్సిన ఈ పదవుల కోసం ఆయన ఇప్పటికే ఇద్దరి పేర్లు ప్రతిపాదించారు.  సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యతతో పాటు పార్టీ పట్ల అంకిత భావాన్నీ, పార్టీ కోసం పని చేసిన తీరునూ కూడా పరిగణనలోనికి తీసుకుని మరీ ఈ పేర్లు ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.    
ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డికి జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యత..!
అర్బన్ నక్సల్, రూరల్ నక్సల్ అనే పదాల సరసన ఇప్పుడు దిమాగీ నక్సల్అ నే కొత్త బ్రాండ్‌ను చేర్చారన్నారు భరద్వాజ. అంతేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను భౌతికంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించి మార్చి 31 2026 డెడ్ లైన్ విధించిన సంగతిని గుర్తు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.