తెలుగుదేశం పార్టీ తొలి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్

Publish Date:Apr 15, 2026

Advertisement

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ లభించింది. 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం శ్రేణులూ, నేతలూ కూడా లోకేష్ కు పార్టీలో, ప్రభుత్వంలో మరింత కీలక స్థానం కల్పించాలని గత ఏడాదిన్నర పైగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

ఒక అడుగు ముందుకు వేసి ఈ విషయాన్ని చంద్రబాబు సమక్షంలోనే కొదరు స్పష్టంగా చెప్పారు కూడా. అలాగే తెలుగుదేశం శ్రేణులైనా ఒక సమయంలో లోకేష్ కు పార్టీలోనే కాదు, ప్రభుత్వంలో కూడా ప్రమోషన్ ఇవ్వాలనీ, ఆయన పార్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా నియమించాలనీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనీ కూడా బాహాటంగానే డిమాండ్ చేశారు. మరీ ముఖ్యంగా కడప మహానాడుకు ముందు ఈ డిమాండ్ తెలుగు దేశం శ్రేణుల నుంచి చాలా చాలా గట్టిగా వినిపించింది. ఒక దశలో కడప మహానాడు వేదికగానే లోకేష్ ప్రమోషన్ ప్రకటన ఉంటుందని కూడా గట్టిగా వినిపించింది. అయితే కూటమి పరిమితుల కారణంగా అప్పట్లో చంద్రబాబు లోకేష్ ప్రమోషన్ విషయంపై బాహాటంగా ఎవరూ వ్యాఖ్యలు చేయవద్దని గట్టిగా మందలించారు కూడా.ఇప్పుడు లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ లభించింది. తెలుగుదేశం పార్టీకి తొట్ట తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ నియమితులయ్యారు.  

నారా లోకేశ్ కు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అధికారికం నియామకం జరిగింది కానీ.. ఆయన చాలా కాలంగా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అన్ని రకాలుగా అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో లోకేష్ ముద్రను బలంగా  ఉంది.  ఇక పార్టీ కేడర్ తో లోకేష్ రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు. అన్నిటికీ మించి లోకేష్ యూత్ గా బాగా కనెక్ట్ అవుతారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ నియామకం పార్టీ పరంగా ఆయన ఇమేజ్ ను మరింత పెంచుతుందనడంలో సదేహం లేదు.  

పొలిట్ బ్యూరోతో పాటు పార్టీలోనూ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న లోకేష్ భావనకు అనుగుణంగానే ఇప్పుడు పార్టీ కమిటీల ప్రకటన కూడా ఉంది.   రెగ్యులర్ గా కార్యకర్తలకు అందుబాటులో ఉండే లోకేశ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం పార్టీ మరింత బలోపేతం కావడానికి, కార్యకర్తలలో మరింత జోష్ నింపడానికి దోహదపడుతుందని తెలుగుదేశం సీనియర్లు గట్టిగా చెబుతున్నారు.  

By
en-us Political News

  
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.