అమెరికా, ఇరాన్ మధ్య ముగిసిన తొలి విడత శాంతి చర్చలు.. కుదిరిన ఒప్పందాలేంటంటే?

Publish Date:Jun 22, 2026

Advertisement

అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠ రేపిన అమెరికా, ఇరాన్ దేశాల ఉన్నత స్థాయి శాంతి చర్చలు ముగిశాయి.  స్విట్జర్లాండ్‌లోని  బర్గెన్‌స్టాక్ నగరంలో జరిగిన ఈ  తొలి విడత చర్చలలో   నాటకీయ పరిణామాలు జరిగాయి. ఒక దశలో చర్చలు అర్ధంతరంగా ముగిసిపోయాయా? అన్న అనుమానాలు సైతం తలెత్తాయి. అయితే.. చివరికి ఈ చర్చలు సానుకూలంగా ముగియడంతో ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది.  ప్రపంచ దేశాలననీ అత్యంత ఆసక్తితో    ఈ భేటీలో ఇరు దేశాల మధ్య నెలకొన్న సుదీర్ఘ ప్రతిష్టంభనను తొలగించే దిశగా ఒక ముందడుగు పడింది. వచ్చే 60 రోజుల్లో సంపూర్ణమైన తుది ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే లక్ష్యంగా ఇరు దేశాలు ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకోవడం ఈ చర్చల్లో సాధించిన అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు.

అయితే..  ఈ శాంతి చర్చల ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఇరాన్ ను తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తే సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు   కలకలం రేపింది. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్  ట్రూత్ సోషల్  వేదికగా ట్రంప్  ఇరాన్ తన ప్రాక్సీ గ్రూపులను అదుపులో పెట్టుకోకుంటే..  గత వారం కంటే ఘోరమైన, తీవ్రమైన దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందం టూ హెచ్చరించారు. అలాగే.. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హ‌ర్మూజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తామని, చర్చల కోసం వచ్చిన ఇరాన్ ప్రతినిధుల బృందాన్ని కిడ్నాప్ చేస్తామంటూ ఆ పోస్టులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

ట్రంప్ చేసిన ఈ అవమానకరమైన, బెదిరింపు వ్యాఖ్యలపై ఇరాన్ ప్రతినిధులు   ఆగ్రహం వ్యక్తం చేసి చర్చలను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించి వాకౌట్ చేశారు.  దీంతో చర్చలు విఫలమై కథ మళ్లీ మొదటికొచ్చిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.  అయితే.. ఇరు దేశాల మధ్యా శాంతి కోసం మీడియేట్ చేస్తున్న పాకిస్థాన్,  దేశాలు రంగంలోకి దిగాయి. ఇరుపక్షాలతో  సంప్రదింపులు జరిపి, వారిని మళ్లీ చర్చల టేబుల్ ముందుకు తీసుకువచ్చాయి.  

తొలి విడత భేటీలో ..  చర్చల పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు, సరైన రాజకీయ మార్గనిర్దేశం చేసేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ కమిటీ పరిధిలో అణు కార్యక్రమాలు, ఆర్థిక ఆంక్షల ఎత్తివేత, పర్యవేక్షణ వంటి ప్రత్యేక అంశాలపై వర్కింగ్ గ్రూపులు పనిచేసి నివేదికలు సమర్పిస్తాయి. దీనితో పాటు, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హ‌ర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల భద్రతను నిర్ధారించడానికి ఇరు దేశాల మధ్య ఒక ప్రత్యేక కమ్యూనికేషన్ లైన్‌ను ఏర్పాటు చేస్తారు. రాబోయే 60 రోజుల్లోగా శాశ్వత శాంతి ఒప్పందాన్ని ఖరారు చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకు సాగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు తగ్గుతాయని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ డెట్రాయిట్ ప్లాంట్ లో 1000 మంది ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో 50 కోబోట్ రోబోలను ప్రవేశపెట్టింది. టెక్నాలజీ మరియు ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు కోల్పోతున్న కార్మికుల గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆసియా-పసిఫిక్ రీజియన్‌లోనే తొలిసారిగా హాంకాంగ్ వేదికగా 2027 పూమా హైరాక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ (PUMA HYROX World Championships) జరగనున్నాయి. దీనికి సంబంధించిన తేదీలు, వేదిక మరియు అద్భుతమైన రికార్డుల వివరాలు మీకోసం.
ప్రముఖ మార్కెట్ నిపుణులు ఆశిష్ చతుర్మోహతా విశ్లేషణ ప్రకారం స్టాక్ మార్కెట్ తదుపరి ర్యాలీని నడిపించే బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, మరియు మిడ్‌క్యాప్ సెక్టార్ల పూర్తి వివరాలు మీకోసం
WHOOP ఫిట్‌నెస్ ట్రాకర్ ఎలా పనిచేస్తుంది? స్ట్రెయిన్, రికవరీ మరియు స్లీప్ ట్రాకింగ్ ఫీచర్లతో మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.
22 ఏళ్ల వయసులోనే ₹15,000 కోట్ల డిఫెన్స్ టెక్నాలజీ సామ్రాజ్యాన్ని నిర్మించిన ఈథన్ థోర్న్టన్ (Ethan Thornton) స్ఫూర్తిదాయక విజయం, మాక్ ఇండస్ట్రీస్ సంచలన రికార్డుల గురించిన పూర్తి వివరాలు మీకోసం.
భారత స్టాక్ మార్కెట్ లో నేడు పండగ వాతావరణం నెలకొంది. సెన్సెక్స్ 400 పాయింట్లు జంప్ చేయగా, నిఫ్టీ 24,100 మార్కును దాటి దూసుకుపోయింది. రిలయన్స్, ఐటీ షేర్ల ర్యాలీ వివరాలు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మరియు ఐపీఓ అప్‌డేట్స్ ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
గ్లోబల్ ఐటీ దిగ్గజం అక్సెంచర్ ఇచ్చిన షాక్‌తో భారతీయ ఐటీ రంగంలో 1.35 లక్షల కోట్ల రూపాయల సంపద హరించుకుపోయింది. 52 వారాల కనిష్టానికి పడిపోయిన ఇన్ఫోసిస్, టీసీఎస్, కోఫోర్జ్ షేర్లు మళ్లీ కోలుకుంటున్న తరుణంలో మార్కెట్ నిపుణులు ఇన్వెస్టర్లకు ఇస్తున్న కీలక సూచనలు మరియు టార్గెట్ లెవెల్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.
ఖతార్‌లోని ప్రముఖ రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలోని బర్జన్ గ్యాస్ ప్లాంట్‌లో ఘోర పేలుడు సంభవించింది. 54 మంది గాయపడగా, 18 మంది గల్లంతయ్యారు. ప్రపంచ ఇంధన మార్కెట్‌పై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
న్యూజిలాండ్‌తో జరిగిన ఓవల్ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ జట్టుకు ఐసీసీ 12 డబ్ల్యూటీసీ పాయింట్ల కోత విధించింది. అలాగే ఆటగాళ్లకు 50 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026లో కేవలం 10 రోజుల్లోనే 8 ఓన్ గోల్స్ నమోదయ్యాయి. 2018 రష్యా రికార్డును బద్దలు కొట్టే దిశగా సాగుతున్న ఈ విచిత్రమైన ఫుట్‌బాల్ రికార్డుల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
రకాల, భూపాలపల్లి ప్రధాన రహదారిపై సరిగ్గా జిల్లా రవాణా అధికారి కార్యాలయం ముందే ఈ ప్రమాదం జరిగింది. రవాణా శాఖకు చెందిన సిబ్బందితో కలిసి డీటీఓ వెంకన్న కార్యాలయం ముందు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు.
పుల్లంపేట వద్ద కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ఒక భారీ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది తిరుపతి నుంచి కడప వైపు వెళ్తున్న నాన్‌స్టాప్ ఆర్టీసీ సర్వీసు బస్సు పుల్లంపేట సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది.
విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్.. కీచకుడిగా మారి.. ఏఐ టూల్స్ సహాయంతో తన వద్దే చదువుకునే ఒక మైనర్ విద్యార్థినిపై మానసిక దాడికి తెగబడ్డాడు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన సదరు ఉపాధ్యాయుడిని విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.