ఫస్ట్ రిజల్ట్ కాంగ్రెస్ ఖాతాలో.. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన హస్తం!

Publish Date:Dec 3, 2023

Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమైపోయింది. తొలి రౌండ్ నుంచి 60కి పైగా స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శిస్తూ హస్తం దూకుడు మీదుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ ను కూడా కాంగ్రెస్ దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. మూడు నాలుగు రౌండ్ల ఫలితాలలో కొన్ని కీలక స్థానాలు ఇప్పటికే  అధీక్యత వేలల్లో ఉండడంతో ఈ స్థానాలు  కాంగ్రెస్ ఖాతాలో చేరడం ఖాయమైపోయినట్లే భావించవచ్చు. తెలంగాణ ఎన్నికల ఫలితాలలో తొలి విజయం కూడా కాంగ్రెస్ పార్టీయే సొంతం చేసుకుంది. అశ్వరావు పేట నుంచి ఆదినారాయణరావు విజయం సాధించారు. అలాగే రెండో విజయం కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడింది. ఇల్లెందు నుంచి కూడా కాంగ్రెస్ గెలిచింది. మొత్తంగా చూస్తే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేటట్లు కనిపిస్తున్నది. ఈ జిల్లాలో పొత్తులో భాగంగా ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించిన సంగతి విదితమే.  ఏది ఏమైనా స్పష్టమైన మెజార్టీతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ వెలువడిన తొలి రెండు ఫలితాలనూ తన ఖాతాలోనే వేసుకుంది.   ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట అభ్యర్థి ఆదినారాయణరావు విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై ఆదినారాయణరావు విజయం సాధించారు.   ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ 65కు పైగా సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తూ విజయం దిశగా దూసుకెళ్తుండగా బీఆర్ఎస్ 40 సీట్లలో మాత్రమే ముందంజలో ఉంది. ఇక పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి తాను పోటీ చేసిన కామారెడ్డి, కొడంగల్ రెండు స్థానాల్లోనూ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. కొడంగల్ లో మూడు రౌండ్లు పూర్తయ్యే సమయానికి ఆయన 4,159 ఓట్ల లీడ్ లో ఉండగా.. కామారెడ్డిలో ఫస్ట్ మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత ఆయన 2,354 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం గెలుస్తాడని భావించిన బీజేపీ కామారెడ్డిలో రెండో స్థానంలో ఉండగా.. సీఎం కేసీఆర్ మూడవ స్థానంలో ఉండడం బీఆర్ఎస్ శ్రేణులను షాక్ కు గురి చేస్తోంది. ఇక ఉమ్మడ నల్గొండ జిల్లాలో సూర్యాపేట మినహా మిగతా అన్ని స్థానాల్లోనూ హస్తం  హవా కొనసాగుతోంది. సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి మినహా మిగతా అన్ని సీట్లలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. బీజేపీ కీలక నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్, రఘునందన్ రావు కూడా వెనకబడ్డారు. 

ఇక  హైదరాబాద్, రంగారెడ్డిలో కారు జోరు కాస్త కనపడుతోంది. గజ్వేల్ లో కేసీఆర్, సిద్దిపేటలో హరీశ్ రావు, సిరిసిల్లలో కేటీఆర్ లీడ్ లోకి రాగా.. కేసీఆర్, కేటీఆర్ స్వల్ప అధీక్యంలోనే ఉండడం ఉత్కంఠ కలిగిస్తుంది. కాంగ్రెస్ కీలక నేతలు రేవంత్ రెడ్డి రెండు చోట్ల అధీక్యంలో ఉండగా.. భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క తదితరులు స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ముందంజలో ఉండడం విశేషం. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ కాస్త ముందంజలో ఉంది. బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీలో ఉన్న సిర్పూర్ లో కౌంటింగ్ రసవత్తరంగా మారింది. అక్కడ బీజేపీ, బీఎస్పీ మధ్య నువ్వా, నేనా అన్నట్లుగా లెక్కలు మారుతున్నాయి.

కాగా, ప్రస్తుత ట్రెండ్స్ ను పరిశీలిస్తే హంగ్ వచ్చే అవకాశం  ఏమాత్రం కనిపించడం లేదు. చివరి రెండు మూడు రౌండ్లలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప హంగ్ వచ్చే పరిస్థితి లేదు. దీంతో అధికారంలోకి రావడం ఖాయమని ఫిక్స్ అయిన కాంగ్రెస్ ఆ దిశగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతల ఇళ్ల వద్ద సంబరాలు మొదలయ్యాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీస్ భద్రతా బలగాలు మోహరించగా.. కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ అభిమానులు బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకుంటున్నారు. మరోవైపు గెలిచిన ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక బస్సులను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ తాజ్ కృష్ణా వద్ద ప్రత్యేక బస్సులు రెడీగా ఉంచారు. అలాగే శంషాబాద్ లో రెండు స్పెషల్ ఫ్లయిట్స్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల కోసం మరో నాలుగు హెలికాఫ్టర్లను కూడా పీసీసీ సిద్ధం చేసింది.

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.