హెలికాప్టర్ మెయిల్ సర్వీస్.. భారత చరిత్రలో ఈ అపురూప ఘట్టం గురించి ఎంత మందికి తెలుసు?

Publish Date:Feb 5, 2026

Advertisement

దేశ చరిత్రను, ప్రపంచ చరిత్రను గమనిస్తే ఎన్నో విప్లవాత్మక మార్పులు,  మరెన్నో గొప్ప  ప్రణాళికలు, వ్యూహాలు కనిపిస్తాయి.  నేటికాలంలో స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ పుణ్యమా అని ఎవరికైనా ఫోన్ చేయాలన్నా,  మెసెజ్ చేయాలన్నా, మెయిల్ పంపాలన్నా కేవలం సెకెండ్లు, నిమిషాల వ్యవధిలో జరిగిపోతూ ఉంటుంది.  కానీ మూడు దశాబ్దాల క్రితం ఈ వెసులుబాట్లు ఉండేవి కాదు.. మరీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు సమాచారాన్ని అందించడం చాలా కష్టంగా ఉండేది. ఈ అడ్డంకిని అధిగమించడానికి, పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఆకాశాన్నే తమ మార్గంగా ఎంచుకుని హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్‌ను ప్రారంభించింది. అప్పట్లో కమ్యూనికేషన్ రంగంలో ఈ సర్వీస్ చరిత్ర సృష్టించింది.  ఎంతో ఆసక్తికరమైన ఈ సర్వీస్ గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

భారత్ హెలికాప్టర్ మెయిల్ సర్వీస్..

ఎంతో విప్లవాత్మకమైన భారత్ హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ ను భారతదేశంలో జనవరి 27వ తేదీ,  1988లో ప్రారంభించారు. భారతదేశం ద్వీప సమూహాలతో కూడుకుని ఉంటుంది.   ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవులకు ఏదైనా సమాచారాన్ని అందించడం చాలా కష్టంగా ఉండేది. ఈ చారిత్రాత్మక హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్ కు ఈ దీవులే ప్రారంభ వేదికగా నిలిచాయి. మొదటి విమానం పోర్ట్ బ్లెయిర్ నుండి హేవ్‌లాక్ ద్వీపానికి సమాచారాన్ని చేరవేసేది.

హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ ప్రాధమిక ఉద్దేశ్యం మారుమూల ప్రాంతాలకు కూడా మెయిల్ ను డెలివరీ చేయడం. గతంలో మెయిల్ చేరుకోవడానికి రెండు నుండి మూడు రోజులు పట్టే ప్రాంతాలు కాస్తా హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ వచ్చాక ఆ దూరం,  సమయం చాలా తగ్గాయి.

భారత తపాలా శాఖ..

హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ ను విజయవంతం చేయడానికి బారత తపాలా శాఖ పవన్ హన్స్ లిమిటెడ్ తో కలిసి పనిచేసింది. ఈ సేవలో ప్రధానంగా డౌఫిన్ హెలికాప్టర్ ను ఉపయోగించారు. తొలి విమాన ప్రయాణ గుర్తుగా ఫస్ట్ డే కవర్లు జారీ చేయబడ్డాయి.  వీటిలో చాలా స్పెషల్ గా పిలువబడే హెలికాప్టర్ మెయిల్ స్టాంప్ కూడా ఉంది.  ఇది నేటికీ తపాలా చరిత్రలో విలువైన రికార్టు కావడం విశేషం.

ప్రపంచంలో హెలికాప్టర్ మెయిల్ సర్వీస్..

ప్రపంచంలో మొట్టమొదటి హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ అక్టోబర్ 1, 1947న అమెరికాలో ప్రారంభమైంది. US పోస్టల్ సర్వీస్, లాస్ ఏంజిల్స్ ఎయిర్‌వేస్‌తో కలిసి, సికోర్స్కీ S-51 రోటరీ-వింగ్ హెలికాప్టర్‌ను ఉపయోగించి  ఈ సర్వీస్ ను నడిపింది.

అమెరికా విజయం సాధించిన ఒక సంవత్సరం తర్వాత, యునైటెడ్ కింగ్‌డమ్ కూడా 1948లో తన సొంత హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్‌ను ప్రారంభించింది.

ఇదీ భారతదేశంలో జరిగిన హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ గురించి ఆసక్తికరమైన సమాచారం.

                                 *రూపశ్రీ.

By
en-us Political News

  
Why Indian Tulsi Is in Huge Demand Across Muslim Countries, Indian Tulsi Becomes a Hot Commodity in Muslim Countries, Indian Tulsi Demand Explodes in Muslim Nations, Why Muslim Countries Are Crazy About Indian Holy Basi
ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో తప్పులు చేస్తాడు. కానీ అంతమాత్రాన వారు తప్పు చేస్తున్నారని, వారు తప్పు వ్యక్తులని కాదు. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన విషయం నిర్ణయం తీసుకున్నప్పుడు,  తరచుగా పొరపాట్లు చేస్తారు...
భారతదేశంలో వివాహానికి ముందు జాతకాల పొంతనను చూస్తారు. మరీ ముఖ్యంగా పెద్దలు కుదుర్చే పెళ్లిలో జాతకాల ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది.  జాతకాలు సరిపోతే..  గ్రహాలు , నక్షత్రాల అనుకూలంగా ఉంటే వైవాహిక బంధం ఎంతో బలంగా..
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది,  ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం..
పెళ్లి ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వేడుక. భారతీయులకు అయితే పెళ్లి అనేది జీవితంలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు.  కానీ నేటికాలంలో ఆ వైవాహిక బంధం మసకబారింది. కొత్తగా పెళ్లైనవాళ్లు ఏడాది కూడా గడపకుండానే...
ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో విజయవంతంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. దీనికి మంచి విద్య, మంచి విలువలు చాలా అవసరం. ఇవన్నీ ఉన్నా సరే.. కొంతమంది అమ్మాయిలు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు...
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా..
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా..
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే...
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.