అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం
Publish Date:Apr 20, 2026
Advertisement
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలిలో ఒక అపార్ట్ మెంట్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. టీఎన్జీవోస్ కాలనీలోని అపార్ట్‌మెంట్ లో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన భవనం బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు నాలుగు అంతస్తుల నివాస సముదాయం. సమాచారం అందిన వెంటనే ఐదు అగ్నిమాపక యంత్రాలు, భారీ స్కైలిఫ్ట్‌తో సహా ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోని ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు గుర్తించారు, . సెల్లార్‌లో నిలిపి ఉంచిన వాహనాలతో పాటు అక్కడ భద్రపరిచిన పాత సోఫాలు, ఇతర గృహోపకరణాల అంటుకుని క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. అపార్ట్‌మెంట్ అంతా దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. సెల్లార్‌లో నిబంధనలకు విరుద్ధంగా సామాగ్రిని నిల్వ చేయడం వల్లే మంటలు వేగంగా వ్యాపించాయని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
http://www.teluguone.com/news/content/fire-in-appartment-36-217834.html





