ముజఫర్ పూర్ ఆస్పత్రిలో అగ్రిప్రమాదం.. ముగ్గురుర సజీవదహనం

Publish Date:Jun 4, 2026

Advertisement

బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో గురువారం (జూన్ 4) తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు మరణించారు. నగరంలోని  ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.   తెల్లవారుజామున సరిగ్గా నాలుగు  సమయంలో..  రోగులంతా గాఢ నిద్రలో ఉన్న వేళ ఐదవ అంతస్తులోని ఐసీయూలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే దట్టమైన పొగ, మంటలు ఐసీయూ అంతటా వ్యాపించడంతో అక్కడ ఉన్న రోగులు, వారి బంధువులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.  

ఈ ఘోర అగ్నిప్రమాదంలో కనీసం ముగ్గురు రోగులు  సజీవ దహనమవగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్‌లు అత్యంత వేగంగా ఘటనాస్థలికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.  ఐసీయూలో చిక్కుకుపోయిన సుమారు 15 మంది రోగులను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు. తీవ్ర పొగ కారణంగా ఊపిరాడక ఇబ్బంది పడుతున్న మిగిలిన రోగులను వెంటనే సమీపంలోని ఇతర ఆసుపత్రులకు తరలించి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు.

అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు కానీ,  షార్ట్ సర్క్యూట్  వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. కాగా సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా మేజిస్ట్రేట్  ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో ఉన్న రోగుల కుటుంబ సభ్యుల, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు, రెవెన్యూ అధికారులు అధికారికంగా నమోదు చేసుకున్నారు. విచారణ నివేదిక అందిన వెంటనే బాధ్యులపై, ఆసుపత్రి యాజమాన్యంపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.  

By
en-us Political News

  
గచ్చిబౌలిలోని ఓ ఎలైట్ కోలివింగ్‌లో ఒక యువతి తన జీవితానికి చివరి అధ్యాయం రాసుకున్నది.
బీఆర్‌ఎస్ నేత సురేష్ రెడ్డి ఇంట్లో భారీ చోరి జరగడం తో హైదరాబాద్ సనత్ నగర్ జెడ్ కాలనీ ఇప్పుడు ఒక్క సారిగా చర్చల కేంద్రంగా మారింది.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన రష్యా పర్యటనను యథావిధిగా కొనసాగించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్ల దాడుల వార్త వెలువడే సమయానికి ఆయన మాస్కో నుండి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ప్రయాణిస్తున్నారు. అక్కడ నెలకొన్న భద్రతా ఏర్పాట్లు, తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం, లోకేష్ తన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదని నిశ్చయించుకున్నారు.
మలేషియా దేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై మరోసారి చమురు భారం పడింది.
తమిళనాట బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మాట్లాడారు.
అమెరికాలోని న్యూయార్క్ సిటీలోలో తెలుగు యువకుడు కుంచా అన్షుల్ దారుణ హత్యకు గురైనాడు.
తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు అసాంఘిక శక్తుల కదలికలను ముందుగానే గుర్తించి అరికట్టేందుకు సిటీ పోలీసులు శుక్రవారం
దాంపత్య బంధాన్ని కాపాడేది సహనం, సంభాషణే..
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఒక అపూర్వమైన, వినూత్నమైన పోరాటం రోడ్డెక్కింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.