మధ్యతరగతి కుటుంబాలు చేసే ఈ తప్పుల వల్ల చాలా డబ్బు నష్టపోతున్నారు!

Publish Date:Feb 14, 2026

Advertisement

డబ్బు మనిషి జీవితానికి చాలా అవసరం.  డబ్బు లేని జీవనం దుర్బరంగా ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో పేద వారు మరీ అంత ఇబ్బందులలో ఉండరు,  ధనవంతులకు డబ్బు గురించి ఎలాంటి చింత ఉండదు. కానీ మధ్యతరగతి కుటుంబాలు మాత్రం డబ్బు విషయంలో తెలిసీ తెలియక కొన్ని తప్పులు చేస్తారు.  ఈ కారణంగా చాలామంది డబ్బు నష్టపోతున్నారు.  ఈ విషయాన్ని స్వయానా ప్రపంచంలోనే ప్రముఖ మిలియనీర్ అయిన వారెన్ బఫెట్ పేర్కొనడం గమనార్హం. మధ్యతరగతి ప్రజలు తాము ఎంతో కష్టపడి పోగు చేసిన డబ్బును చేతులాగా నష్టపోతారని ఆయన అంటున్నారు. ఇంతకీ మధ్యతరగతి ప్రజలు డబ్బు ఎలా నష్టపోతున్నారు? తెలుసుకుంటే..

క్రెడిట్ కార్డు ఇంట్రెస్ట్..

ఈ రోజుల్లో మధ్యతరగతి ప్రజలు క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఇది వారు చేసే  అతిపెద్ద తప్పట. నిజానికి, క్రెడిట్ కార్డులపై అధిక వడ్డీ రేట్ల భారం మధ్యతరగతిపై పడింది. మధ్యతరగతి వారు  క్రెడిట్ కార్డు వడ్డీ  సైకిల్  నుండి తప్పించుకోలేకపోతున్నారు.  దీని వలన ఎలాంటి  పెట్టుబడి పెట్టలేకపోతున్నారు.

కొత్త కారు కొనడం..

కారును హోదాకు చిహ్నంగా చూస్తారు. కానీ కారును హోదాకు చిహ్నంగా భావించి కొనుగోలు చేస్తే తప్పు చేసినట్టే.  కారు అనేది  ప్రయాణ సాధనంగా ఉండాలి. కొత్త కారు కొనుగోలు కారణంగా మధ్యతరగతి వారు ఎక్కువగా  అప్పుల ఊబిలో చిక్కుకుంటారు. లోన్లు  తీసుకోవడం వల్ల కారు మార్కెట్ ధర కంటే ఖరీదైనదిగా మారుతుంది. అయితే కాలక్రమేణా కారు విలువ కూడా తగ్గుతుంది. దీని ఫలితంగా  మధ్యతరగతి వారు  డబ్బును పెట్టుబడి పెట్టలేకపోతున్నారు.

లాటరీ లేదా జూదం..

మధ్యతరగతి వారు తరచుగా జూదం ఆడి లేదా లాటరీ టిక్కెట్లు కొనడం ద్వారా ధనవంతులు కావాలని ప్రయత్నిస్తారు.  దీని కారణంగా వారు తమ డబ్బును కోల్పోయే పొరపాటు చేస్తారు.  మధ్య తరగతి కుటుంబాలలో చాలామంది  అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చాలా డబ్బును వృధా చేస్తారు. అదే  డబ్బును వ్యాపారంలో పెట్టుబడి పెట్టగలిగినప్పుడు,కష్టాన్ని నమ్ముకుని ప్రయత్నాలు చేసినప్పుడు  అది విలువను పెంచుతుంది.

అవసరానికి మించి..

మధ్యతరగతి కుటుంబాలలో కొందరు తమ ఆర్థిక స్థాయి,  తమ అవసరానికి మించి  ఇళ్లను  కట్టుకుంటారు.   ఇళ్లు గ్రాండ్ గా ఉండాలని అనుకుంటారు,  దీనికోసం అప్పులు తీసుకుంటారు.  ఇల్లు కేవలం జీవన సాధనం, హోదా,  చిహ్నం కాదని గుర్తించరు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. మధ్యతరగతి కుటుంబాలలో చాలా శాతం.. తమ జీవితాంతం ఇల్లు కట్టుకోవడానికి చేసే ప్రయత్నాలలోనే కాలాన్ని గడుపుతాయి. ఈ కారణంగా ఆస్తులు కూడబెట్టుకోవడానికి మధ్య తరగతి వారి వద్ద ఏమీ మిగలదు.

                          *రూపశ్రీ.

By
en-us Political News

  
అన్నా తమ్ముడు, అక్కా చెల్లి, అన్నా చెల్లెళ్లు,  అక్కా తమ్ముళ్లు.. ఇలా తోబుట్టువుల బంధాలు చాలా గొప్పవి. ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టిన వారి మధ్య బంధం ఎంతో అపురూపమైనది.
"నేటి బాలలె రేపటి పౌరులు.." "విత్తనం మంచిదైతే పసిడి పంట పండుతుంది".  ఇలాంటి మాటలు తరచుగా వింటూనే ఉంటాం.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలోని ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కోవాలని కోరుకుంటారు.
ఆచార్య చాణక్యుడు   గొప్ప రాజనీతిజ్ఞుడు,  వ్యక్తిత్వ విశ్లేషణా నిపుణులు,  ఆర్థిక శాస్త్ర నిపుణులు.  ఆయన వేల సంవత్సరాల కిందటే మనిషి జీవితంలో ఎన్నో విషయాలను ఎంతో స్పష్టంగా, వివరంగా చెప్పాడు.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటూ ఉంటారు. కానీ ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు మానవ సంబందాలే ఆదుకుంటాయి.  
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలు ఉండాలని కోరుకుంటారు, కానీ ఇది అంత సులభమైన పని కాదు.
నేటి కాలంలో ఇల్లు, కారు, పిల్లల చదువు, వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం లోన్ తీసుకోవడం చాలా సాధారణమైంది.
ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి కుటుంబంతో ఉండే అనుబంధం చాలా గొప్పది. ఎన్నో విషయాలు కుటుంబం నుండే నేర్చుకుంటారు.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, తెలివైనవారుగా, క్రమశిక్షణ గలవారుగా , స్వయం సమృద్ధి గలవారుగా ఉండాలని కోరుకుంటారు.
జీవితం అన్నాక సంతోషాలు,  ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు బాధపడటం అందరూ చేసే పనే.. కానీ.. కొందరుంటారు.. చుట్టూ ఉన్నవారు బాధపడితే.. ఏడిస్తే.. వారిని ఓదార్చాలనే ఆలోచనలతో "ఏడిస్తే ఏం ప్రయోజనం?", "
పిల్లలు చదువును ఒత్తిడిగా కాకుండా ఆనందంగా భావించాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. చాలామంది తల్లిదండ్రులు మంచి మార్కులు రావాలని ఆశపడతారు.
ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత అందంగా కనిపిస్తుంది. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో బూజు దులపడం, తుడవడం,  ఇంట్లో ఎక్కడైనా సాలీడు పురుగులు, బొద్దింకలు వంటివి రాకుండా చూడటం చేస్తుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.