ఏపీ అసెంబ్లీ టైగర్...విపక్షాల పాలిట సింహస్వప్నం

Publish Date:Mar 11, 2026

Advertisement

 

ఒక రాజకీయ నాయకుడిలో విషయ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి....మేధస్సు , వీటన్నింటి తోపాటు ఆర్థిక వ్యవహారాలపై అవగాహన తోడయితే … ఆ నాయకుడు పరిపూర్ణ రాజకీయవేత్తగా అవతరిస్తారు…ఆయనపై విమర్శలు చేయాలన్నా ప్రత్యర్థులకు గుండెళ్లో రైలు పరుగెత్తడమే....అది నిజంగా చాలా అరుదైన కాంబినేషన్‌. ఇటు ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంత మాస్‌గా ఉంటారో… అటు శాసన సభా,ఆర్థిక వ్యవహారాల్లో అంత క్లాస్‌గా ఉంటారు. తన వాగ్ధాటితో విపక్షాలను గడ గడ లాడించడం వల్ల ఆయన సహచర ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచే కాదు… రాజకీయ వర్గాలన్నింటి నుంచీ ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన ఎవరో మీకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది... ఆయనే అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.

ఆయన గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదని ఓ ప్రచారం ఉండేది. కాని దానికి భిన్నంగా 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాదించిన నేపథ్యంలో పయ్యావుల కూడా ఉరవకొండ నుంచి గెలుపొందారు. దీంతో పార్టీ లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న కేశవ్ కు మంత్రివర్గంలో కీలక శాఖలు కేటాయించారు చంద్రబాబు.. పార్టీ అధినేత తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ ఇంటా బయటా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పయ్యావులపై ప్రశంసల వర్షం కురిపించారు. పార్టీ అధినేత చంద్రబాబు కూడా ప్రశంసించారు.ఈ నేపథ్యంలో… వాటీజ్ పయ్యావుల? ఆయన పనితనం ఎలా ఉంటుంది? అన్న చర్చ మొదలైంది.

బడ్జెట్‌ను ఎవరికైనా చదవడం మామూలే…కానీ ఆ బడ్జెట్‌ను స్పష్టంగా, గణాంకాలతో, విశ్లేషణతో వివరించగలిగితేనే అసలు ఆర్థిక నిపుణుడని చెప్పాలి. అలా మాట్లాడే నాయకులు అరుదుగానే ఉంటారు. పయ్యావుల కేశవ్ కూడా అలాంటి నాయకుల్లో ఒకరు. ఆర్థిక మంత్రిగా ఆయనకు తొలి అనుభవం మాత్రమే కావచ్చు. కానీ ఆయన చూపిస్తున్న పట్టుదల, డేటాపై ఉన్న అవగాహన… రాజకీయ వర్గాలను ఆకట్టుకుంటోంది. ఇటీవల అసెంబ్లీలో పయ్యావుల బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా నిలిచాయి. పయ్యావుల మాట్లాడుతున్నప్పుడు అది ఒక క్లాస్ విన్నట్టుగా ఉంటుందని… ఆయనకు ఉన్న విషయ పరిజ్ఞానం, డేటాపై పట్టు అద్భుతమని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. 

ఇంతటితో ఆగకుండా… పయ్యావుల తన నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక కరపత్రం చూపిస్తూ… అక్కడ జరుగుతున్న పనులను కూడా వివరించారు.పయ్యావుల విషయంలో మాత్రం ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. పయ్యావుల కేశవ్ కేవలం పదవి ఉన్నందుకే ఈ పనితనం చూపిస్తున్న నాయకుడు కాదు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలోనే ఆయన పీఏసీ చైర్మన్ గా తన మేధస్సు, విశ్లేషణతో ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లోని లోపాలను బయటపెట్టారు. అప్పుడు ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన అంశాల్లో ముఖ్యమైనది సీఎఫ్‌ఎంఎస్ స్కామ్. దాదాపు 41 వేల కోట్ల రూపాయల లావాదేవీలకు సరైన రికార్డులు లేవని ఆయన ఆధారాలతో వెల్లడించారు. కోడ్‌లను మార్చి నిధులను పక్కదారి మళ్లించారని… తన ఆడిట్ నివేదికల ఆధారంగా వివరించారు.ఈ అంశంపై ఆయన చేసిన పోరాటం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. 

బడ్జెట్‌లో చూపించకుండా, ట్రెజరీ నిబంధనలకు విరుద్ధంగా ఖర్చులు జరిగాయని పయ్యావుల ఆరోపించడంతో… కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో పాటు కాగ్ కూడా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. పయ్యావుల రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే… ఆయన టీడీపీలో విశ్వసనీయమైన, మేధావి వర్గానికి చెందిన నాయకుడిగా గుర్తింపు పొందారు. అదే సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు.1994, 2004, 2009, 2019, 2024 ఎన్నికల్లో… అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుంచి వరుసగా గెలిచారు. మధ్యలో ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. 

చంద్రబాబు ఒక పని అప్పగిస్తే… అది పూర్తయ్యే వరకు పయ్యావుల నిద్రపోరని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. అంత నిజాయితీగా బాధ్యతను నిర్వహించే నాయకుడిగా ఆయన పేరుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన  ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల్లోని లోపాలను ఆధారాలతో బయటపెట్టి పెద్ద చర్చకు దారితీశారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… ముఖ్యమంత్రి చంద్రబాబు పయ్యావుల కేశవ్‌కు అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను అప్పగించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతైన అధ్యయనం చేసి… అప్పుల వివరాలను ప్రజల ముందుంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా… సూపర్ సిక్స్ వంటి సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తూ… అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం సాధించేలా బడ్జెట్ రూపకల్పన చేశారు. పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో మాట్లాడుతుంటే అది ఒక క్లాస్ విన్నట్టుగా ఉంటుందని… ఆయన డేటాపై పట్టు అద్భుతమని పవన్ పేర్కొన్నారు. ఇలా నమ్మకం, పనితనం రెండింటికీ ప్రతీకగా నిలుస్తున్నారు పయ్యావుల కేశవ్. 2026 ఫిబ్రవరి 14న ఆయన ప్రవేశపెట్టిన ₹3.32 లక్షల కోట్ల బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యం సాధించిందని విశ్లేషకులుఅభిప్రాయపడుతున్నారు. 

ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రిగా… ఆయన పనితీరుకు అన్ని వర్గాల నుంచీ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.ఐదు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీగా అనుభవం ఉన్న పయ్యావుల… ఇటీవల ముగిసిన శాసన మండలి సమావేశాల్లో సంఖ్యా బలంలో అధికంగా ఉన్న వైసిపీ పక్షానికి చెమటలు పట్టించారు. బడ్జెట్ పై విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఏవో పేపర్లు చూపిస్తూ కాగ్ నివేదకలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని మాట్లాడారు. దానికి పయ్యావుల ఆ పేపర్లు పంపితే చూసి సమాధానం చెబుతానని పట్టు పట్టారు. 

చివరకు ఆ పేపర్లు కాగ్ నివేదిక కాదని జగన్ పత్రికలో వచ్చిన కథనాలని తేల్చి వైసీపీ డొల్ల తనాన్ని ఎండగట్టారు. అలాగే కల్తీ నెయ్యి విషయంలోని విపక్ష ఆరోపణలను బలంగా తిప్పి కొట్టారు. ఏవిషయంపైనైనా సరే పూర్తి సమాచారంతోనే మీడియా ముందుకు రావడం ఆయన ప్రత్యేకత..ఇప్పుడు మంత్రిగా కూడా అదే ధోరణిలో ముందుకు సాగుతున్నారు. ఇటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూనే… అటు తన నియోజకవర్గ అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు.చాలా కాలం తర్వాత… ఒక మంచి ఆర్థిక అవగాహన ఉన్న నాయకుడు ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారని సామాన్య ప్రజలు కూడా భావిస్తున్నారు.


 

By
en-us Political News

  
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా నగరంగానే కాకుండా.. ప్రపంచస్థాయి పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రబిందువుగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గతంలో హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా ముందుకు తీసుకువెడుతున్నారు.
దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది.
2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన శైలిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.