Publish Date:Dec 29, 2022
చదవేస్తే ఉన్న మతి పోయిందంటారు. చదువు వల్ల సంస్కారం పెరిగితేనే ఆ చదువుకు సార్థకత. ఊర్లలో బస్సులో సీట్ల కోసం పామరులు కోట్లాటలకు దిగడం సహజం. అలాగే రైళ్లలో అన్ రిజర్వుడు కంపార్ట్ మెంట్లలో చోటు కోసం చొక్కాలు పట్టుకుని కొట్టుకునే వారినీ చూశాం. కానీ విద్యావంతులైన యువకులు విమానంలో సీటు కోట్లాటకు దిగి కొట్టుకున్న సంఘటన మాత్రం ఎవరూ చూసి ఉండరు. అయినా విమనాంలో సీటు కోసం కొట్టుకోవడమేమిటి చోద్యం కాకపోతే అనుకుంటాం. కానీ అలాంటి చోద్యం జరిగింది.
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ముంబై నుంచి థాయ్ ల్యాండ్ వెళ్లేందుకు విమానం రన్ వేపై సిద్ధంగా ఉంది. ఇహనో ఇప్పుడో టేకాఫ్ తీసుకుంటుంది. సరిగ్గా ఆ సమయంలో విమానంలో గొడవ జరిగింది. అది చినికి చినికి గాలివానగా మారింది. ఇంతకీ ఆ గొడవ సీటు విషయంలో జరిగింది.
ఔను నిజమే సీటు కోసం టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న విమానంలో ముగ్గురు యువకులు గొడవ పడ్డారు. జుట్టూ జుట్టూ పట్టుకు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు విసురుకున్నారు. విమాన సిబ్బంది సర్ది చెప్పడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించ లేదు.
గొడవ అంతకంతకూ తీవ్రమౌతుంటే సిబ్బంది కూడా చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు రంగ ప్రవేశం చేసిన తరువాత గొడవ సద్దుమణిగింది. వీరి గొడవ కారణంగా దాదాపు గంటన్నర ఆలస్యంగా విమానం టేకాఫ్ అయ్యింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fight-in-flight-between-three-youth-25-149197.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.