దేశంలో తగ్గుతున్న జనాభా.. దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటు స్థానాలకు ఎసరు!

Publish Date:Jun 18, 2022

Advertisement

గంపెడు పిల్లల్ని కని సుఖ సంతోషాలతో జీవించండి అనే పాత కాలం రోజులు పోయాయి. ఒకరిద్దురు పిల్లలతో ఆనందంగా జీవించండి, ఆర్థిక ఇబ్బందులకు దూరంగా ఉండండి అంటూ పెద్దలు తమ పిల్లల్ని దీవించే కాలం వచ్చేసింది. అలాగే యువతలో కూడా కుటుంబ భవిష్యత్, ఆర్థిక పురోగతి వంటి విషయాలలో స్పష్టతతో ముందుకు అడుగు వేస్తున్నారు. ఈ కారణంగా దేశంలో జనాభా పెరుగుదల నియంత్రణలోకి వచ్చింది. అయితే ఇది ఉత్తరాదితో పోలిస్తే.. దక్షిణాదిలోనే ఒకింత ఎక్కువగా ఉంది. ఇక దేశంలో ఉత్తరాది ఆధిపత్యం అధికం, దక్షిణాది పట్ల చిన్న చూపు అన్న భావన దక్షిణాది వారిలో చాలా కాలం నుంచీ ఉంది. జాతీయ భాష అంటూ హిందీని నెత్తిన రుద్దుతున్నారనీ, హిందీ రాని వారిని అంటే ముఖ్యంగా దక్షిణాది వారిని దేశంలో రెండో తరగతి పౌరులుగా చూస్తున్నారని దక్షిణాది వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మొదటి నుంచీ ఉంది. జనాభా నియంత్రణ దేశ ప్రగతిని అత్యంత కీలకమంటూ గతంలో కేంద్రం విస్తృతంగా ప్రచారం చేసింది. కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది.

దక్షిణాది రాష్ట్రాలలోనే కుటుంబ నియంత్రణ ప్రచారానికి ఉత్తరాదితో పోలిస్తే ఎక్కువ స్పందన కనిపించింది. అదే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు జాతీయ రాజకీయాలలో ప్రాతినిథ్యం తగ్గిపోయే ముప్పును తెచ్చింది. షెడ్యూల్ ప్రకారం 2026లో నియోజకవర్గాల పునర్విభజన అంటూ జరిగితే లోక్ సభలో దక్షిణాది ప్రాతినిథ్యం గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన 2026లో జరగాల్సి ఉంది. అలా జరిగితే దక్షిణాది నుంచి లోక్ సభ స్థానాలు తగ్గిపోయే అవకాశం ఉంది.  అదే సమయంలో ఉత్తరాదిలో లోక్ సభ స్థానాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. 2026లోజనాభా ప్రాతిపదికన నియోజకవర్గ పునర్విభజన జరిగితే.. ఐదు దక్షిణాది రాష్ట్ర్రాలలో కలిపి 26లోక్ సభ నియోజకవర్గాలు తగ్గిపోతాయి. అదే ఉత్తరాది రాష్ట్రాలలో 31 స్థానాలు పెరుగుతాయి. ప్రపంచంలోనే జనాభా వేగంగా పెరుగుతున్న దేశంగా ఇంత కాలం అందరూ చెబుతూ వచ్చారు. అనతి కాలంలోనే జనాభా విషయంలో భారత్ చైనాను దాటేసి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరిస్తుందనీ అంచనాలు వేశారు. కానీ వాస్తవంగా భారత్ లో జనాభా తగ్గుతూ వస్తోంది. అది కూడా పూర్తిగా అన్ ప్రపోర్షనేట్ గా ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ, కుటుంబ సంక్షేమం అంటే అమలు చేసిన పథకాలు దేశంలో జనాభా నియంత్రణ విషయంలో ప్రజలలో ఏదో ఒక మేరకు చైతన్యం తీసుకురావడమే. ఉత్తరాదితో పోలిస్తే ఈ చైతన్యం దక్షిణాదిలో  ఎక్కువగా వచ్చింది. దీంతో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో జనాభా నియంత్రణ విజయవంతంగా  అమలైంది.

అయితే కేంద్రం మాత్రం అన్ని గ్రాంటులు, నిధులు, కార్యక్రమాలను జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు కేటాయించడంతో కుటుంబ నియంత్రణ పకడ్బందీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగింది. ఈ విషయాన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలు సందర్భాలలో కేంద్రానికి నిరసన రూపంలో తెలియజేశారు. కుటుంబ నియంత్రణ అమలు చేసిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సింది పోయి.. నిధుల్లో కేతేమిటని కూడా వారు పలు సందర్భాలలో నిలదీశారు. అదలా ఉంచితే..   ఇప్పుడు జనాభా ప్రకారం పునర్విభజన జరిగితే లోక్‌ సభ సీట్ల స్వరూపం పూర్తిగా మారుతుంది. ఉత్తరప్రదేశ్‌ , బీహార్‌‌‌‌, మధ్యప్రదేశ్‌ ,మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలకు సీట్లు బాగా పెరుగుతాయి. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ , ఒడిశా,తెలంగాణ సీట్లు తగ్గుతాయి.   1971లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినపుడు పెద్ద రాష్ట్రాల్లో ఒక్కో లోక్‌ సభ నియోజకవర్గాని కి ఓటర్లు 10 లక్షల నుంచి 10.6 లక్షల వరకు ఉన్నారు. ఈ 40 ఏళ్లలో సీట్ల సంఖ్య మారలేదుగానీ ఓటర్లు పెరిగారు. 2016 జనాభానే ప్రాతిపదికగా తీసుకుంటే రాజస్థాన్‌ లో ఒక్కో ఎంపీ 30 లక్షల మందికి ప్రాతినిధ్యం  హిస్తున్నాడు. అదే తమిళనాడులో ఇది 18 లక్షలు  మాత్రమే. 

జాతీయు కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో సంతానోత్పత్తి రేటు పడిపోయింది. ఆ సర్వే ప్రకారం 2015-16లో 2.2గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2019-21 నాటికి 2.0కు పడిపోయింది.   పునఃస్థాపన స్థాయి సంతానోత్పత్తి  అనేది జనాభా ఒక తరం నుండి మరొక తరానికి సరిగ్గా భర్తీ చేసే స్థాయిని సూచిస్తుంది, తద్వారా స్థాయి తగినంత కాలం పాటు కొనసాగితే సున్నా జనాభా పెరుగుదలకు  దారి తీస్తుంది. 1992-93, 2019-21 మ‌ధ్య కాలంలో దేశంలో  టోటల్ ఫెర్టలిటీ రేటు 3.4  నుంచి 2కు ప‌డ‌పోయింది.  ఈ విధంగా టిఎఫ్ ఆర్ ప‌డిపోవ‌డ‌మ‌న్న‌ది  ప‌ట్ట‌ణాలలో 1992-93లో 2.7 వుండ‌గా అది 2019-21లో అది 1.6కి ప‌డిపోయింది. అయితే  ప్ర‌జ‌లు నివ‌సించే  ప్రాంతంతో సంబంధం లేకుండా  ఈ సంతానోత్స‌త్తి రేటు   20-24 మధ్య వయస్కులలో  అధికంగా ఉంటుందనీ, ఆ తరువాత వయస్సు పెరిగే కొద్దీ   క్రమంగా  త‌గ్గిపోతుంద‌ని  ఎన్ ఎఫ్ హెచ్ స‌ర్వేల‌న్నీ తేల్చాయి.  మ‌హిళ‌ల్లో సంతానోత్ప‌త్తి రేటు త‌గ్గ‌డానికి   అనేక కార‌ణాల్లో అ విద్య కూడా ఒక‌టి. ప్రాధ‌మిక పాఠ‌శాల చ‌దువు లేని మ‌హిళ‌ల కంటే చ‌దువుకున్న‌ వారి  సంతానోత్ప‌త్తి రేటు  త‌క్కువ‌గా వుంద‌ని తేలింది. చ‌దువు లేని మ‌హిళ‌ల్లో  టోటల్ ఫెర్టిలిటీ రేటు 2.8 వుండ‌గా,   చ‌దువుకున్న మ‌హిళ ల్లో  అది 1.8 గా వుంది.  

  దేశంలో మ‌తాల వారీగా చూస్తే, హిందూ మ‌హిళ‌ల్లో టిఎఫ్ ఆర్ 1.94, ముస్లిం మ‌హిళ‌ల్లో 2.2, క్రిస్టియ‌న్ మ‌హిళ‌ల్లో 1.88, బౌద్ధుల్లో 1.39గా వుంది. కాగా గ్రామీణ  ప్రాంతాల్లో ఈ రేటు 1992-93లో 3.7 వుండ‌గా అది 2019-21 కి 2.1 కి చేరుకుంది.   ప్ర‌స్తుతం భార‌త్ జ‌నాభా సుమారు 140 కోట్లు వుంది. ఇది  2100 నాటికి 109 కోట్లు త‌గ్గే అవ‌కాశం వుంది సర్వే పేర్కొంది ఇందుకు సంతానోత్ప‌త్తి రేటు ప‌డిపోవ‌మే ప్ర‌ధాన కార‌ణంగా నివేదిక‌లు స్ప‌ష్టం చేశాయి.  భారతదేశంలో స్త్రీల విద్య వ్యాప్తి చెందడంతో గర్భనిరోధక పద్ధతులు పెరుగుతాయని భావిస్తున్నారు. 2021లో భార‌త్‌లో సంతానోత్ప‌త్తి 2.38 శాతం వుండ‌గా 2100 నాటికి 1.6 శాతానికి ప‌డిపోవ‌చ్చు!   2030 నాటికి  ప్ర‌పంచం మొత్తం మీద వాత‌వ‌ర‌ణంలో పెను మార్పులు సంభ‌విస్తాయ‌ని, ప్ర‌జ‌లు అస్స‌లు త‌ట్టుకోలేని వేడిమి వుంటుంద‌ని, స్వ‌చ్ఛ‌మ‌యిన నీరు ల‌భించ‌క ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌వ‌ల‌సి వ‌స్తుంద‌ని వాతావ‌ర‌ణ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అంతేగాక క్ర‌మేపీ ప్ర‌జ‌ల్లో  రోగ‌ నిరోధ‌క శ‌క్తి క్షీణిస్తుంద‌నీ అన్నారు. ఫ‌లితంగా ప్ర‌జ‌లు జ‌బ్బుల బారిన పడి  నానా ఇబ్బందులూ ఎదుర్కొంటారు. 

1960లో భార‌త మ‌హిళ‌లు తమ జీవిత‌కాలంలో క‌నీసం ఆరుగురు పిల్ల‌ల్ని   క‌న‌గ‌లిగే సామర్థ్యంతో ఉండేవారు.   2005  నాటికి ఇది ముగ్గురు పిల్లలకు పరిమితమైపోయింది.  ఇదే ట్రెండ్ కొనసాగితే జాతీయ రాజకీయాలలో దక్షిణాది ప్రాతినిథ్యం నామామాత్రపు స్థాయికి పడిపోయే ప్రమాదం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. జనాభా ప్రాతిపదికతో పాటు ప్రాంతీయ ప్రాతినిథ్యానికి గండి పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాలలో కూడా జనాభా పెరుగుదల రేటు మందగించినప్పటికీ.. అది దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ.  
 

By
en-us Political News

  
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది. గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు, అభివృద్ధి , సుపరిపాలన, సంక్షేమం, సాధికారత విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది. అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సేవల వివరాలను అందించనుంది.
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.