Publish Date:Apr 21, 2022
తెలంగాణ రాష్ట్ర సమితిలో నిన్నటి వరకూ కనిపించిన ఆల్ఈజ్ వెల్ ఫీలింగ్ ఇప్పుడు కనిపంచడం లేదు. పార్టీ అగ్రనాయకత్వం నుంచి కింది స్థాయి క్యాడర్ వరకూ ఒక విధమైన అలజడిలో ఉన్నట్లుగా అనిపిస్తున్నది. వేధింపులు, అత్యాచారాలు, కబ్జాలు వంటి నేరాలలో ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు తేలిన నాయకులపై చర్యకు కూడా చర్యలు తీసుకునేందుకు అధినేత సాహసించలేని విచిత్ర పరిస్థితి ఇప్పుడు పార్టీలో కనిపస్తున్నది.
మరో వైపు కాంగ్రెస్, బీజేపీల విమర్శల దాడిని ఎదుర్కొనే విషయంలో కూడా గతంలోలా పార్టీ నేతలు, కేబినెట్ సభ్యులు దూకుడుగా కనిపించడం లేదు. ఇందుకు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంతరెడ్డిలు విమర్శలు, సవాళ్లతో విరుచుకుపడుతున్నా తెరాస వైపు నుంచి గతంలోల దీటైన సమాధానం రాకపోవడమే నిదర్శనం. ఈ నేపథ్యంలోనే వచ్చె నెల 6న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంతో ఏర్పాట్లు చేస్తున్నాయి. కనీసం 5లక్షల మందితో సభ నిర్వహించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. రాష్ట్రంలో బీజేపీ దూకుడు మీద ఉన్నట్లు కనిపిస్తున్నా వాస్తవంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పట్టు పైనే తెరాస ఆందోళనగా ఉందని చెప్పాలి. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తరువాత క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులలో ఉత్సాహం పెరగిందని పరిశీలకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే కేటీఆర్ వరంగల్ పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. పైకి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసమే పర్యటన అని చెబుతున్నప్పటికీ...రాహుల్ పర్యటనకు కాంగ్రెస్ ఏర్పాట్లు, ఆ పర్యటనకు జనసమీకరణ కోసం కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలకు స్పందన వంటి అంశాలపై ఆరా తీయడానికేనన్నది పరిశీలకుల అంచనా. అంతే కాకుండా తెరాస నుంచి కొందరు అసమ్మతి వాదులు, అసంతృప్తులు రాహుల్ సభ వేదికగా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయన్న సమాచారం కూడా కేటీఆర్ పర్యటనకు ఒక కారణంగా చెబుతున్నారు.
అలా మారుతారనుకుంటున్న వారంతా ద్వితీయ, తృతీయ శ్రేణి వారే అయినా వారిని బుజ్జగించి పార్టీ మార్పు ఆలోచనను విరమింపచేయడమే లక్ష్యంగా కూడా కేటీఆర్ వరగంల్ పర్యటన పెట్టుకున్నారని పార్టీ వర్గాల సమాచారం. మామూలు పరిస్థితులలో అయితే ఇటువంటి పార్టీ మార్పిళ్లకు టీఆర్ఎస్ పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి ఉండేది కాదు. కానీ ప్రస్తుతం పార్టీ పట్ల వ్యతిరేకత పెచ్చరిల్లుతోందన్న విపక్షాల వమర్శల దాడి నేపథ్యంలో ఈ మార్పిళ్లను నివారించడం ద్వారా కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాహుల్ సభలో వారూహించినట్లుగా తెరాస నుంచి ఎవరూ వెళ్లకుండా నివారించడం ద్వారా విపక్షాల విమర్శలన్నీ వాస్తవాలు కావన్న సంకేతాన్ని జనాలకు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కేటీఆర్ వరంగల్ పర్యటన అంతరార్థంగా చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fear-in-trs-ktr-tour-to-address-it-39-134741.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.