Publish Date:Aug 29, 2024
తెలుగు భాష వైభవానికి పునాదులు వేసిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు. అందుకే ఆయనను తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడుగా పిలుస్తారు. గ్రాంథికభాషలో పండితులకు మాత్రమే అర్థం అయ్యేలా ఉన్న తెలుగు భాష మాధుర్యాన్ని ప్రజలందరికీ అందేలా కృషి చేశారు. తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చారు.
శిష్ట వ్యవహారికం పేరిట వాడుక భాషలో బోధనకు ఆయన పెద్దపీట వేశారు. తెలుగు పదాల్లోని భావాన్ని, స్పష్టతను పామరులకు సైతం అర్థమయ్యేలా తెలియజెప్పిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి. తెలుగు వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. ఆయన జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా నిర్వహిస్తారు.
రామ్మూర్తి శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేటలో 29 ఆగస్టు1863న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకమ్మ, వీర్రాజు. స్థానిక పాఠశాలలో చదువుకున్న ఆయన 1875లో తండ్రి మరణించడంతో విశాఖలోని తన మేనమామ ఇంటికి వెళ్లారు. అక్కడ హైస్కూల్లో చేరాడు. పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఆయనకు ఆసక్తి. దాంతో దేవాలయం శాసనాలను సొంతగా చదివి అర్థం చేసుకునేవారు. పదోతరగతి పూర్తి చేసిన తర్వాత ప్రైవేటు టీచర్ గా పనిచేస్తూ డిగ్రీ డిస్టింక్షన్‌లో పూర్తి చేశారు. గజపతి మహారాజు కాలేజీలో అధ్యాపకుడిగా చేరారు. పిల్లలకు అర్థమయ్యేలా తెలుగు భాష బోధనను రోజు మాట్లాడుకునే వ్యావహారికంలో చేయాలన్న ప్రయత్నం ఆయనది. 1907లో ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా వచ్చిన జె.ఎ.యేట్స్ అనే బ్రిటిష్ అధికారి నుంచి రామ్మూర్తికి మద్దతు లభించింది. దాంతో అప్పటివరకు గ్రాంధికంగా ఉన్న తెలుగుభాషా బోధనను సరళతరం చేస్తూ వ్యావహారికంలో బోధన ప్రారంభించారు. రామ్మూర్తి ఆశయాన్ని గుర్తించిన శ్రీనివాస అయ్యంగార్, గురజాడ అప్పారావు, మరికొందరితో కలిసి వ్యావహారిక భాషలో బోధనోద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం 'తెలుగు' అనే పత్రికను ప్రారంభించారు. ఈ ఉద్యమం ప్రభావంతో అప్పటివరకు గ్రాంధిక భాషలో నిర్వహించే పరీక్షలు వ్యావహారిక భాషలోనూ రాసే వీలు కలిగింది. దాంతో స్కూలు, కాలేజీ పాఠ్యపుస్తకాలు వ్యావహారిక భాషలో విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి.
తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా మద్రాసు ప్రభుత్వం రావు బహద్దూర్ బిరుదు తో ఆయనను సత్కరించింది. కైజర్ ఈ హింద్ బిరుదు ఆయనను వరించింది. 22జనవరి,1940న మరణించేంతవరకు తెలుగుభాషే ఊపిరిగా ఆయన జీవించాడు.
(గిడుగు వెంటక రామ్మూర్తి జయంతి సందర్భంగా)
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/father-of-telugu-language-movement-25-183839.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్