ఆర్మీ చీఫ్‌కు తండ్రి, తమ్ముడి సెల్యూట్.! భావోద్వేగ ఘట్టం.!
Publish Date:Jul 3, 2026
Advertisement
భారత ఆర్మీ నూతన చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ధీరజ్ సేథ్ గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించిన అనంతరం.. ఓ భావోద్వేగ సన్నివేశం ఆవిష్కృతమైంది. నూతన ఆర్మీచీఫ్ కు ఆయన తండ్రి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేఎం సేథ్, సోదరుడు భారత నౌకాదళం లో టు స్టార్ అధికారైన రియర్ అడ్మిరల్ రవ్నీష్ సేథ్ సెల్యూట్ చేశారు. ధీరజ్ సేథ్ తండ్రి భారత సైన్యంలో త్రీస్టార్ జనరల్ గా సేవలందించి పదవీ విరమణ చేశారు. ఆయన కుమారుడు ఆయన కంటే ఉన్నత స్థాయికి చేరుకుని ఇండియన్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ తన తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా ధీరజ్ సేథ్ సోదరుడు ఇండియన్ నేవీ అధికారి కావడం విశేషం. ఆయన సెల్యూట్ ను స్వీకరంచిన ధీరజ్ సేథ్..అంతే గౌరవంతో తమ్ముడికి సెల్యూట్ చేశారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒకే వేదికపై సైనిక వందనాలు సమర్పించుకోవడం ఒక అపూర్వ ఘట్టంగా, ఒక ఉద్వేగ పూరిత సన్నివేశంగా అక్కడున్న వారందరినీ కదిలించింది. ఒకే కుటుంబంలో ఒక త్రీ-స్టార్ జనరల్, ఒక ఫోర్-స్టార్ జనరల్, ఒక టు-స్టార్ నేవీ అడ్మిరల్ ఉండటం.. ఈ ముగ్గురూ ఒకే వేదికపై సైనిక వందనం సమర్పించుకోవడానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
http://www.teluguone.com/news/content/father-and-younger-brother-salute-the-army-chief-36-224939.html





