రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కుర్మద్ది, మేడిపల్లి గ్రామాల్లో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు పేరుతో అధికారులు జేసీబీల సహాయంతో భూముల్లోకి ప్రవేశించి రైతులు వేసిన పంటలు, విత్తనాలను తొలగించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేసిన పంటలను ఎలాంటి నోటీ సులు ఇవ్వకుండా ధ్వంసం చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. భూములకు సంబంధించి కోర్టులో కేసు కొనసాగుతుండగా, స్టే అమల్లో ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు, పోలీసులు బలవంతంగా భూముల్లోకి ప్రవేశించారని వారు ఆరోపించారు.
అధికారులను అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించగా, పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా తొలగించారని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ పేద రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా రని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని, భూముల విషయంలో కోర్టు ఆదేశాలను గౌరవించాలని రైతులు డిమాండ్ చేశారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/farmers-protest-in-future-city-36-224767.html
గల్ఫ్ దేశంలో ఉద్యోగాల కోసం 20 మంది మహిళలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఒమాన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న వీరు విమానం ఎక్కబోతుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని నిలిపివేసి అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో హైదరా బాద్‌తో పాటు మొత్తం 20 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఎలాంటి సమాచారం బయటకు వెళ్లకుండా అధికారులు అత్యంత గోప్యంగా ఈ సోదాలు చేపట్టాయి.
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో శతాబ్ద కాలానికి పైగా ఎంతో పవిత్రంగా, చారిత్రక వారసత్వంగా విరాజిల్లుతున్న గురుద్వారాను కొందరు దుండగులు పాక్షికంగా కూల్చివేసి ధ్వంసం చేయడంపై సిక్కు సమాజమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవతావాదులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇండియా కూడా తీవ్రంగా స్పందించి పాకిస్థాన్ తీరును గర్హించింది.
మణిపూర్‌లోని కమ్‌జాంగ్ జిల్లా సరిహద్దు గ్రామాలు బుధవారం (జులై1) హింసాత్మక ఘర్షణలు, పరస్పర దాడులలతో దద్దరిల్లిపోయాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
జడ శ్రవణ్ కుమార్ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు నాలుక కోసి దానిని నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పార్సిల్ పంపిస్తానంటూ అభ్యంతరకరమైన,అనుచితమైన వ్యాఖ్యలు చేశారు.
అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో భారీ స్కోరు సాధించినప్పటికీ, వరుణుడు విరుచుకుపడటంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.
చాలా కాలంగా ఇరు దేశాల మధ్య నిలిచిపోయిన అధికారిక, అనధికారిక దౌత్య మార్గాలను మళ్లీ తెరిచి, అన్ని సమస్యలపై ప్రత్యక్ష సంప్రదింపులకు తక్షణమే శ్రీకారం చుట్టాలని ఈ ప్రముఖులు ఆ లేఖలో ఇరు దేశాల ప్రముఖులకు విజ్ణప్తి చేశారు.
అమెరికా అండతో రెచ్చిపోతున్న ఇజ్రాయెల్‌ను అదుపులో ఉంచాలనీ, లేకుండా తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. అమెరికా గనుక ఇజ్రాయెల్ దేశాన్ని నియంత్రించడంలో విఫలమైతే.. తామ స్పందన తీవ్రాతి తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుష్ప్రచారం, వ్యక్తిగత దూషణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన పరిచయం ప్రేమగా మారింది.
స్టీల్ ప్లాంట్ సందర్శనకు వైసీపీకి అనుమతి నిరాకరణ..
ఇరాన్ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని కన్నుమూయడంతో ఆ దేశంలో ఒక చారిత్రాత్మక అధ్యాయం ముగిసింది