మట్టి మనుషుల అరణ్యరోదన!

Publish Date:Aug 10, 2025

Advertisement

జై జవాన్.. జై కిసాన్.. జైహింద్.. నినాదాలకే పరిమితమా? కర్షకులకు, శ్రామికులకు సరైన ఆదాయం లేక విలవలలాడుతున్న జన భారతం. వివరాల్లోకి వెడితే.. ఆరు దశాబ్దాల కిందట భారతావని వరుస కరువు కాటకాలతో ఆకలి కేకలతో అల్లాడి, తల్లడిల్లిపోయింది. విదేశాల నుంచి ధాన్యం వస్తే తప్ప మన పొయ్యిలోని పిల్లి లేవని దుస్థితి. నాడు ఓడ వస్తేనే నోట్లోకి ముద్ద వెళ్లేది అనే నానుడి దేశ ప్రతిష్ఠకు మచ్చలా మారింది. 
అలాంటి దుర్భర, దీనావస్థ నుంచి అనతి కాలంలోనే ఆహార ధాన్యాల దిగుబడిలో స్వావలంబన సాధించగలిగే స్థాయికి భారత దేశం చేరుకోగలిగింది. హరిత విప్లవం పితామహుడు, ఎంఎస్ స్వామినాథ్ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త నార్మన్ బోర్లాంగ్ సహకారంతో 1960లో మొదలైన హరిత విప్లవం భారత జాతి తలరాతను మార్చివేసింది. ఆధునిక దిగుబడి ఇచ్చే వంగడాల వినియోగం, నీటి వనరుల సమర్థ వాడకం, చీడపీడ నివారణల పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వడంతో హరిత విప్లవం ప్రారంభమైన ఐదేళ్లలోనే దేశీయంగా గోధుమ ఉత్పత్తి దాదాపు రెట్టింపైంది. రెండున్నర దశాబ్దాలలో వరి ఉత్పాదకతలో మూడు రెట్లు వృద్ధి నమోదైంది. హరిత విప్లవం దరిమలా జన భారతానికి ఆహారభద్రత లభించినప్పటికీ.. సాగుదారుల ఆదాయాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. రైతు సంక్షేమానికి ఎంఎస్ స్వామినాథన్ చేసిన సిఫారసులు బుట్లదాఖలయ్యాయి. సిఫారసులు ఆచరణలోకి తీసుకురావడంపై ప్రభుత్వాలు దృష్టి సారించినప్పుడే సాగురంగ రుషి అయిన ఎంఎస్ స్వామినాథన్ కు ఘనమైన నివాళి. 

అన్నదాతలు, మట్టిమనుషులకి వ్యవసాయం అంటేనే వ్యయం చేయడం, సాయం అడగడం పరిపాటి అయిపోయింది. నేటి రైతు దుస్థితికి ప్రభుత్వ విధానాలు కారణమైతే.. ప్రకృతి వికృతి రూపం కారణం. రైతే దేశానికి వెన్నెముక అంటారు. సకలచరాచర జీవకోటికి అన్నంపెట్టే అన్నదాత.. ఆర్తనాదాలు లేని గ్రామాలే లేవంటే అతిశయోక్తి కాదు. కారణాలు అనేకం. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేవు. పండించిన పంటలను నిల్వ చేసుకునే శీతల గిడ్డంగులు లేవు. రైతులకు  సకాలంలో ఎరువులు, క్రిమి సంహారక  మందులపై సబ్సిడీ అందుబాటులో ఉండటం లేదు. క్రిమి సంహారక మందుల ధరలు ఏటాటా అడ్డూ అదుపూ లేకుండా పెస్టిసైడ్స్ కంపెనీలు పెంచుకుంటూ పోతుంటే..కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ మంత్రులు లంచాలవతారులై  రైతు వెన్ను విరుస్తున్నారు. నకిలీ పెస్టిసైడ్స్, విత్తనాలు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. అమ్మేవారిపైన కఠిన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవడం లేదు. రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించినప్పుడే వ్యవసాయం ఫలసాయం అవుతుంది..

వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాలు సృష్టించడంలో మన శాస్త్రవేత్తలు వెనుకబడి ఉన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు నేరుగా ప్రభుత్వమే సేకరించి  రైతులకు తక్షణమే ప్రభుత్వ మద్దతు ధరతో చెల్లించే ప్రక్రియ లేనే లేదు. మధ్య దళారీ వ్యవస్థ వల్ల అటు రైతు, ఇటు వినియోగదారుడు నష్టపోతున్నారు. ఈ మధ్య కాలంలో రాయలసీమలో తోతాపురి మామిడి రైతుల దుస్థితి చూశాము. అదే విధంగా పక్కనే ఉన్న మెట్రోపాలిటిన్ నగరాలైన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మొదలైన నగరాలలో తోతాపురి మామిడి కిలో 60 రూపాయల నుంచి 80 రూపాయల వరకూ అమ్మడం జరిగింది. కనీసం రైతులకు కేజీకి ఎనిమిది రూపాయలు కూడా గిట్టుబాటు కాలేదు. దీనికి కారణం ఎవరు? మన పాలకుల విధి విధానాలే. ఇలాగా అన్ని పంటల దుస్థితి ఇలాగే దాపురించింది. ప్రభుత్వాలు మేలుకోకపోతే దేశంలో భవిష్యత్ లో వ్యవసాయం చేసే వారే కరువౌతారు. తస్మాత్ జాగ్రత్త.!

By
en-us Political News

  
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.