ఫామ్‌హౌస్‌ కేసు విచారణ సీబీఐకే.. తేల్చి చెప్పిన హైకోర్టు

Publish Date:Feb 6, 2023

Advertisement

ఎమ్మెల్యేలకు ఎర కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్.. సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతో తెలంగాణ సర్కార్ కు ఇక ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయమే అంతటా వ్యక్తమౌతోంది. 

ఇటు భారతీయ జనతా పార్టీ, (బీజేపీ) అటు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రెండు పార్టీల మధ్య, ఇంచుమించుగా సంవత్సరానికి పైగా సాగుతున్న రాజకీయ పోరాటంలో బీఆర్ఎస్ కష్టాలు ఎదుర్కొనక తప్పదు.  ఎమ్మెల్యేల బేరసారాల కేసులో రాష్ట్ర హై కోర్టు సిగిల్ జడ్జి బెంచ్  గతంలో  కేసీఆర్ ప్రభుత్వానికి షాకిస్తూ కేసు విచారణను సిబిఐకి అప్పగించిన సంగతి విదితమే. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ సర్కార్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఇప్పుడు డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ తీర్పును సమర్ధిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను కొట్టివేయడంతో.. ఇక ఫార్మ్ హౌస్ కేసు సబీఐ దర్యాప్తు ప్రారంభించడం అనివార్యమని తేలిపోయింది.

రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ రాష్ట్రంలో కాలు పెట్టకుండా అడ్డుకునేందుకు  జనరల్  కన్సెంట్ రద్దు చేసినా, హై కోర్టు తీర్పుతో ఇప్పుడు సిబిఐ రాష్ట్రంలో ఎంటర్ అవుతుంది. ఇలా రెండు విధాలా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం ( సిట్) విచారణ పై విశ్వాసం లేదని, విచారణ పారదర్శకంగా జరగట్లేదని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ కేసులో నిందితులుగా ఉన్న నంద కుమార్, అనుమానితుడిగా ఉన్న అడ్వకేట్ శ్రీనివాస్‌తో పాటు మరో వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన రాష్ట్ర హై కోర్టు,. కేసును సీబీఐకి అప్పగిస్తూ సంచలన తీర్పు నిచ్చింది. దానిని సవాల్ చేసిన ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. 

అధికార టీఆర్‌ఎస్‌/బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రూ.400 కోట్లతో కొనుగోలు చేసేందుకు కొందరు చేసిన యత్నాన్ని సైబరాబాద్‌ పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే.  ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన మధ్యవర్తులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పైలెట్‌ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్‌), రేగా కాంతారావు (పినపాక)ను ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని.. దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన ఎమ్మెల్యేలు దీనిపై తమకు ఫిర్యాదు చేశారని.. తమకు డబ్బులు, కాంట్రాక్టులు, పదవులు ఎర చూపించి పార్టీ మారాలని బలవంతం చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారం మేరకు పక్కా ప్రణాళిక ప్రకారం వల పన్ని ఈ ఆపరేషన్‌ నిర్వహించా మంటూ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించిన సంగతి విదితమే. ఫరీదాబాద్‌ ఆలయానికి చెందిన రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే ఈకేసు విచారణకు ఏర్పాటు చేసిన ‘సిట్’ ఏర్పాటు విషయంలో  మొదటి నంచి అనుమనాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో ఆరుగురు అధికారులతో ఏర్పాటు సెహ్సిన  సిట్  కూర్పు, విషయంలో అనుమనాలు వ్యక్తమయ్యాయి. అలాగే, సిట్  అధికార పరిధిని దాటి తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పద  మయ్యాయి. న్యాయ స్థానాలు సైతం సిట్  గీత దాటిందని పేర్కొన్నాయి. కీలక కేసుల్లో సిట్‌ ఏర్పాటు సాధారణమే అయినా.. డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని నియమించడం మాత్రం ఇదే తొలిసారి కావడంతో అనుమానాలు మరింతగా బలపడ్డాయి. 

ఈ నేపధ్యంలోనే, విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగట్లేదన్న పిటిషర్ల వాదనతో ఏకీభవించింది. ఈ కేసులో సిట్‌ను విచారణను తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ.. సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.  ఈ తీర్పునే ఇప్పుడు డివిజన్ బెంచ్ సమర్ధించింది. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో సీబీఐ దర్యాప్తు సాగనుంది. 

By
en-us Political News

  
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.