రామకృష్ణ కుటుంబం సూసైడ్ కేసులో ఎమ్మెల్యే వనమా కొడుకు అరెస్ట్
Publish Date:Jan 6, 2022
Advertisement
ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారిన కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. రాఘవను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాఘవను పోలీసులు కొత్తగూడెంకు తరలిస్తున్నారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన తనను తీవ్రంగా బాధించిందని, పోలీసుల విచారణకు సహకరిస్తామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు లేఖ విడుదల చేసిన కాసేపటికే రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. సూసైడ్ కు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రకంపనలు స్పష్టించింది. అందులో రాఘవ దురాఘాతాలను వివరించారు రామకృష్ణ. తనను ఎంతగా వేధించారో చెప్పుకున్నారు. అతని వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నానని తెలిపారు. ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవేంద్ర కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమైపోయాయని రామకృష్ణ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గులు రాజకీయంగా ఎదిగితే ప్రమాదమని, ఆయనను ఎదగనివ్వొద్దని కోరారు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడినని, కానీ ఆయన ఏ భర్త వినకూడని మాటను అడిగారని వాపోయారు. తన భార్యను హైదరాబాద్ తీసుకురావాలని కోరారని కన్నీళ్లు పెట్టుకున్నారు రామకృష్ణ. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారని అన్నారు. నీ భార్యను నీవు ఎప్పుడు హైద్రాబాద్ కు తీసుకు వస్తావో అప్పుడు నీ సమస్య పరిష్కారం అవుతుందని తనను వనమా రాఘవేందర్ బెదిరించారన్నారు. . ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలని రామకృష్ణ ప్రశ్నించారు రాఘవ ఆకృత్యాలపై శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చాయి.పాల్వంచ లోని వనమా రాఘువ ఇంటి ముందు ధర్నాకు దిగారు బిజేపి జిల్లా అధ్యక్షుడు. వనమా రాఘువను అరెస్ట్ చేయాలని, సిఎం కేసిఆర్ స్పందించి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ని టిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంకటేశ్వరావు కుమారుడు వనమా రాఘవ.. రామకృష్ణ ఫ్యామిలీని వేధించి చంపేశాడని మండిపడ్డారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆఖరుకు రామకృష్ణ భార్యపైనా అసభ్యంగా మాట్లాడి.. ఆ కుటుంబం చావుకు కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ఫీ వీడియోలో రామకృష్ణ చెప్పింది వింటే.. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అన్నారు. మనుషులు ఇలా మృగాలుగా మారి వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు బహిరంగ లేఖ రాశారు. చట్టానికి, విచారణకు సహకరిస్తానని తెలిపారు. తన కుమారుడు సహకరించేలా బాధ్యత తీసుకుంటానని లేఖలో పేర్కొన్నారు. పార్టీకి నియోజకవర్గానికి రాఘవేంద్రను దూరం పెడుతానని చెప్పారు
http://www.teluguone.com/news/content/family-suicide-case-trs-mla-vanama-son-raghava-arrest-39-129742.html





