రామకృష్ణ కుటుంబం సూసైడ్ కేసులో ఎమ్మెల్యే వనమా  కొడుకు అరెస్ట్

Publish Date:Jan 6, 2022

Advertisement

ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారిన కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. రాఘవను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాఘవను పోలీసులు కొత్తగూడెంకు తరలిస్తున్నారు.  రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన తనను తీవ్రంగా బాధించిందని, పోలీసుల విచారణకు సహకరిస్తామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు లేఖ విడుదల చేసిన కాసేపటికే రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. 

సూసైడ్ కు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రకంపనలు స్పష్టించింది. అందులో రాఘవ దురాఘాతాలను వివరించారు రామకృష్ణ. తనను ఎంతగా వేధించారో చెప్పుకున్నారు. అతని వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నానని తెలిపారు. ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవేంద్ర కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమైపోయాయని రామకృష్ణ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గులు రాజకీయంగా ఎదిగితే ప్రమాదమని, ఆయనను ఎదగనివ్వొద్దని కోరారు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడినని, కానీ ఆయన ఏ భర్త వినకూడని మాటను అడిగారని వాపోయారు. తన భార్యను హైదరాబాద్ తీసుకురావాలని కోరారని కన్నీళ్లు పెట్టుకున్నారు రామకృష్ణ. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారని అన్నారు. నీ భార్యను నీవు ఎప్పుడు హైద్రాబాద్ కు తీసుకు వస్తావో అప్పుడు నీ సమస్య పరిష్కారం అవుతుందని తనను వనమా రాఘవేందర్ బెదిరించారన్నారు. . ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలని రామకృష్ణ ప్రశ్నించారు

రాఘవ ఆకృత్యాలపై శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చాయి.పాల్వంచ లోని వనమా రాఘువ ఇంటి ముందు ధర్నాకు దిగారు  బిజేపి జిల్లా అధ్యక్షుడు. వనమా రాఘువను అరెస్ట్ చేయాలని, సిఎం కేసిఆర్ స్పందించి  ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ని టిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే  వెంకటేశ్వరావు కుమారుడు వనమా రాఘవ.. రామకృష్ణ ఫ్యామిలీని వేధించి చంపేశాడని మండిపడ్డారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆఖరుకు రామకృష్ణ భార్యపైనా అసభ్యంగా మాట్లాడి.. ఆ కుటుంబం చావుకు కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ఫీ వీడియోలో రామకృష్ణ చెప్పింది వింటే.. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అన్నారు. మనుషులు ఇలా మృగాలుగా మారి వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. 

 ఈ తరుణంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు బహిరంగ లేఖ రాశారు. చట్టానికి, విచారణకు సహకరిస్తానని తెలిపారు. తన కుమారుడు సహకరించేలా బాధ్యత తీసుకుంటానని లేఖలో పేర్కొన్నారు. పార్టీకి నియోజకవర్గానికి రాఘవేంద్రను దూరం పెడుతానని చెప్పారు

By
en-us Political News

  
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.