కుటుంబ వివాదాలూ రాజకీయ వేధింపులే.. వైసీపీ నేతల వింత పోకడ.!

Publish Date:Jul 25, 2026

Advertisement

ఏపీలో  వైసీపీ రాజకీయం వింత పోకడలు పోతోంది.  ఆ పార్టీకి చెందిన నేతలు వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.

మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం,  మాజీ మంత్రి జోగి రమేష్ లపై ఇటీవల నమోదైన కేసులన్నీ వారి వారి సొంత విషయాలకు సంబంధించినవి. అయితే ఈ మూడు అంశాలనూ కూడా రాజకీయ వేధింపులంటూ వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.  ఈ కేసులకు కారణం   ఆయా  నేతల వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ వివాదాలే  కారణమని విస్పష్టంగా తెలుస్తున్నా..  అవన్నీ రాజకీయ వేధింపుల కారణంగా నమోదైన కేసులే అని కలరింగ్ ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలపై అన్ని వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
ముందుగా మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కేసు విషయానికి వస్తే..  ఆయన కుమారుడు నిర్లక్ష్యంగా ద్విచక్రవాహనం నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడు.  ప్రమాదం జరిగిన వెంటనే చట్టపరమైన నిబంధనల ప్రకారం పారదర్శకంగా వ్యవహరించడానికి బదులు.. సిదిరి అప్పలరాజు..  ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయన అరెస్టయ్యారు. అంతకు ముందు జగన్ సిదిరి అప్పలరాజుకు మద్దతుగా చిన్న కుర్రోడు యాక్సిడెంట్ చేస్తే అరెస్టు చేస్తారా అంటూ చేసిన వ్యాఖ్యలు జగన్ ప్రతిష్ఠను సైతం మసకబార్చాయి.  

ఆ తరువాత వైసీపీ సీనియర్ నాయకుడు, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విషయం తీసుకుంటే.. ఆయన వైసీపీ హయాంలో తన పలుకుబడిని, అధికారాన్ని ఉపయోగించి నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే ప్రైవేటు భూమిని బోగస్ డెత్ సర్టిఫికెట్, బోగస్ వారసులను సృష్టించి కబ్జా చేశారు. దీనిపై ఆ భూమి యజమాని తను బతికి ఉండగానే.. తన డెత్ సర్టిఫికేట్ సృష్టించి తన భూమిని అన్యాయంగా తమ్మినేని కుమారుడి పేరుపై రిజిస్టర్ చేయించారని ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో ఆయన కుటుంబంతో సహా పరారయ్యారు.  అజ్జాతం నుంచే హైకోర్టును ఆశ్రయించి రాజకీయ వేధింపులతోనే కేసు పెట్టారంటూ ముందస్తు బెయిలు కోరారు. కోర్టు ఆయన యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది. కాగా తమ్మినేని సీతారాం కుటుంబం భూ కబ్జా విషయంలో జగన్ మౌనం ఆయనకు మద్దతుగా నిలిచారన్న సంకేతాన్ని ఇస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు

ఇప్పుడు తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి  జోగి రమేష్, ఆయన కుటుంబ సభ్యుల 11 మందిపై స్వయానా ఆయన కోడలే వరకట్నం కోసంశారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు వేధింపుల కేసు పెట్టారు. వీరి విషయంలో కూడా జగన్ ఇంత వరకూ స్పందించడం కానీ, పార్టీ పరంగా చర్యలు తీసుకోవడం కానీ చేయకుండా పరోక్షంగా అండగా నిలుస్తున్నారు.   ఈ తరహా   సంఘటనలు జరిగిన ప్రతిసారీ  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యలని ఆరోపించడం వైసీపీకి రివాజుగా మారింది.  సొంత సమస్యలు, తప్పుల కారణంగా క్రిమినల్ కేసుల్లో బుక్కై వాటికి రాజకీయ రంగు పులమడానికి వైసీపీ చేసే ప్రయత్నాలు ప్రజలలో ఆ పార్టీ, ఆ పార్టీ నయకత్వంపై వ్యతిరేకత పెరగడానికే దోహదపడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వ్యక్తిగత తప్పులు, కుటుంబ కలహాలతో కేసుల్లో ఇరుక్కుని, వాటిని  రాజకీయ వేధింపులుగా చిత్రీకరించే ప్రయత్నాలను ప్రజలు ఏ మాత్రం హర్షించరని చెబుతున్నారు. 

YSRCP leaders cases, AP political news, Jogi Ramesh family dispute, Appalaraju case, Tammineni family issue

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.