ఏ వయసులో ఏ సమయంలో నిద్రపోవాలి?  నిద్ర గురించి షాకింగ్ నిజాలు..!

Publish Date:Sep 17, 2025

Advertisement


కొంతమంది త్వరగా నిద్రపోయినా కూడా ఉత్సాహంగా ఉండటం, మరికొందరు అర్థరాత్రి వరకు మేల్కున్నా సరే  ఉదయాన్నే లేవడం   బాగా పని చేయడం చేస్తారు. ఇలాంటివాళ్లను  ఎప్పుడైనా గమనించారా? నిద్ర సమయం కేవలం విశ్రాంతి కోసమే కాదు, అది  ఆరోగ్యానికి  సంబంధించినది.  ఒక అధ్యయనం ప్రకారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల మధ్య  నిద్రకు ఉపక్రమించే వారికి  గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని తేలింది.  శరీరం  సహజ లయ ప్రకారం నిద్రపోవడం గుండె,  ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని ఇది ప్రూవ్ చేస్తుంది.

నిద్రించడానికి సరైన సమయం వయస్సును బట్టి మారుతుంది. పిల్లలకు ఎక్కువ నిద్ర అవసరం, టీనేజర్లు అర్ధరాత్రి వరకు  మేల్కొని ఉంటారు, ఆలస్యంగా నిద్రపోతారు. పెద్దలకు పని,  విశ్రాంతి మధ్య సమతుల్యత అవసరం.  వృద్ధులు త్వరగా నిద్రపోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.

ఏ వయసు వారికి ఎంత నిద్ర అవసరం?

పిల్లలు (5–12 సంవత్సరాలు) ఉన్నవారికి  రాత్రి 7:30–9:00 మధ్య నిద్రపోవడం మంచిది. వీరికి 9–12 గంటలు నిద్ర అవసరం.

పిల్లలు బాగా పెరగడానికి, చదువులో దృష్టి పెట్టడానికి,  భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవడానికి తగినంత నిద్ర అవసరం. త్వరగా,  క్రమం తప్పకుండా నిద్రపోవడం వారిని మంచి మానసిక స్థితిలో ఉంచడానికి, ఏకాగ్రత పెరగడానికి,  రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది.

కౌమారదశ (13–18 సంవత్సరాలు)లో ఉన్నవారు  రాత్రి 10:30–11:30 మధ్య తప్పనిసరిగా నిద్రపోవాలి. వీరికి  8–10 గంటలు నిద్ర తప్పనిసరిగా ఉండాలి. చాలామంది తల్లిదండ్రులు చదువు పేరుతో వీరిని నిద్రకు దూరం చేస్తుంటారు. ఇది చాలా తప్పు.

టీనేజర్ల క్రమం తప్పకుండా నిద్రపోవడం వల్ల  మెదడు అభివృద్ధి, మానసిక స్థితి,  విద్యా పనితీరుకు సహాయపడుతుంది. నిద్రపోయే ముందు  ఫోన్ లేదా టీవీ వాడకాన్ని పరిమితం చేయాలి.రాత్రి పడుకునే ముందు మంచి పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోవాలి.

 యువత,  మధ్య వయసు.. (18–64 సంవత్సరాలు)ల మధ్య ఉండేవారందరూ ఒకే నిద్ర సమయాన్ని అనుసరించాలి.  రాత్రి 10:00–11:00 మధ్య నిద్రపోవాలి.  ప్రతిరోజూ తప్పనిసరిగా 7–9 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి.

ఈ వయసు వారు శరీర సహజ లయ ప్రకారం నిద్రపోవాలి. ఈ సమయంలో బయట పనుల కారణంగా   అలసట, శరీరంలో శక్తి తగ్గడం,  మధుమేహం లేదా అధిక రక్తపోటు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రాత్రిపూట కెఫిన్,  భారీ భోజనం మానుకోవాలి.   క్రమం తప్పకుండా ఒక సమయంలో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.

వృద్ధులు (65 ఏళ్లు పైబడినవారు) రాత్రి 9:00–10:00 గంటల మధ్య నిద్రపోవాలి. వీరికి కూడా తప్పకుండా  7–8 గంటలు నిద్ర ఉండాలి.

వృద్ధులు త్వరగా మేల్కుంటూ ఉంటారు.   తక్కువ నిద్రపోతారు. త్వరగా నిద్రపోవడం గుండె ఆరోగ్యానికి, మెదడు పదునుగా ఉండటానికి,  మొత్తం ఆరోగ్యానికి మంచిది. నిద్రవేళకు ముందు కాస్త వాకింగ్, హెర్బల్ టీ లేదా ధ్యానం చేయడం వల్ల  నిద్ర  మెరుగుపడుతుంది. ఎన్ని గంటలకు నిద్రపోతారు అనేదే కాదు.. ఎన్ని గంటలు నిద్రపోతారనేది కూడా ముఖ్యం. వయస్సు ప్రకారం సరైన సమయంలో నిద్రపోవడం మానసిక స్థితి,  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సరైన నిద్ర హార్మోన్లు, రోగనిరోధక శక్తి, జీవక్రియను సమతుల్యంగా ఉంచుతుంది.  మధుమేహం,  డిప్రెషన్  వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

                                 *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

By
en-us Political News

  
నేటి కాలంలో నిమ్మరసం ఎంతో ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి . శరీరాన్ని చల్లబరచడం నుండి డీహైడ్రేషన్‌ను నివారించడం వరకు నిమ్మరసం ప్రయోజనాలు..
కొన్నిసార్లు శరీరంపై నీలం లేదా ఊదా రంగు మచ్చలు  కనిపిస్తాయి. చాలా వరకు ఇలాంటి మచ్చలు ఏవైనా గాయాలు లేదా దెబ్బలు తగిలినప్పుడు బయటకు రక్తం కారడం..
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది శరీరానికి కావలసిన పోషకాలను సరిగ్గా అందజేయలేకపోతున్నారు. ఈ క్రమంలో శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని భర్తీ చేయడానికి..
గుండె మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవం, ఇది శరీరమంతటికీ ఆక్సిజన్ , పోషకాలను అందించడానికి నిరంతరం రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. అయితే, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి,  ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం అనేది ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా 30-32 ఏళ్ల చిన్న వయసులోనే జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూనో, ఫంక్షన్లలో డ్యాన్స్ చేస్తూనో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వార్తలు మనల్ని..
చాలామంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కాళ్ల పిక్కలు పట్టేయడం (Leg Cramps at Night) వల్ల తీవ్రమైన నొప్పితో మేల్కొంటూ ఉంటారు. కండరాలు గట్టిగా బిగుసుకుపోయి, కాళ్లు కదల్చలేనంతగా వచ్చే ఈ నొప్పిని ఆయుర్వేదంలో..
వేడి, విరేచనాలు లేదా వాంతులు వంటివి శరీరంలోని నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను త్వరగా దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ తాగడం చాలా ముఖ్యం. చాలా నీరసంగా ఉన్నప్పుడు, ఆహారం సరిగా తీసుకోలేనప్పుడు...
ప్రతి మనిషి ఇతర మనిషికి చాలా  విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. కొందరు చాలా శాంతంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చాలా చలాకీగా ఉంటారు. ఇంకొందరు చాలా చిన్న విషయాలకే తొందరగా కోపం
భారతీయులకు టీ, కాఫీ ఒక పెద్ద ఎమోషన్. గతంలో కంటే ప్రస్తుతకాలంలో  టీ తాగేవారి సంఖ్య చాలా పెరిగింది.  ఏదైనా పని చురుగ్గా చేయాలంటే చాలామంది మొదటగా టీ తాగుతారు.  ఇక పని మధ్యలో కూడా టీ తాగుతూ ఉత్సాహం తెచ్చుకుంటారు...
బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అయితే రోజురోజుకూ జీవనశైలి పేలవంగా మారడం..
ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు....
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం..
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.