వైసీపీలో సజ్జలకు ఎగ్జిట్ డోర్ ఓపెన్?
Publish Date:Aug 6, 2026
Advertisement
ఏపీ పాలటిక్స్ లో వైసీపీ అంతర్గత వ్యవహారాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మాజీ సీఎం, వైసీపీ అధినేత నివాసం అయిన తాడేపల్లి ప్యాలెస్ ఎదుట.. ఆ పార్టీ సీనియర్ నాయకుడు బోరుగడ్డ అనిల్ తన భార్యతో కలిసి ధర్నాకు దిగడం కలకలం రేపడమే కాకుండా వైసీపీలో సంచలనం సృష్టించింది. పార్టీ అధినేత జగన్ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన అనిల్.. ఈ సందర్భంగా పార్టీలో నంబర్ 2గా చెలామణి అవుతున్న సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై బాహాటంగా విమర్శలు గుప్పించడమే కాకుండా తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్ నివాసం వెలుపల ఉన్న ప్రతి కార్యకర్త కష్టాన్నీ నేను మరిచిపోను అనే ఫ్లెక్సీ ముందే బోరుగడ్డ అనిల్ ధర్నాకు దిగడం విశేషం. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్దకు వచ్చిన తనకు అధినేతను కలిసే అవకాశం ఇవ్వకుండా సజ్జల అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి రావొద్దని సజ్జల రామకృష్ణారెడ్డి తన అనుచరులతో చెప్పించారనీ, తనపై 'రౌడీషీటర్' అనే ముద్ర వేసి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టారు. బోరుగడ్డ అనిల్ ధర్నా ఏదో వ్యక్తిగత వ్యవహారం కాదనీ, సజ్జలకు పార్టీ నుంచి ఎగ్జిట్ చేయడానికి డోర్ ఓపెన్ చేయడంలో భాగంగా పడిన ఫస్ట్ స్టెప్ అనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు వైసీపీలో ఒకప్పుడు నంబర్ 2గా ఉండి, ఆ తరువాత పార్టీ వీడిన విజయసాయి రెడ్డి పార్టీలోకి తిరిగిరానున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ సజ్జలపై విమర్శలు గుప్పిస్తూ.. బోరుగడ్డ ఏకంగా జగన్ నివాసం ఎదుట ధర్నాకు దిగడం కాకతాళీయం ఎంత మాత్రం కాదని అంటున్నారు. గతంలో విజయసాయి రెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్ వంటి సీనియర్ నేతలు సైతం పార్టీలోని కోటరీ వైఖరి పట్ల, మరీ ముఖ్యంగా సజ్జల తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బహిరంగంగానే విమర్శలు గుప్పించిన విషయాన్ని పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పార్టీలోకి విజయసారి తిరిగి రానున్నారన్న ప్రచారం జరుగుతున్న సమయంలోనే బోరుగడ్డ ధర్నా ప్రాముఖ్యత సంతరించుకుంది. సజ్జలకు ఉద్వాసన పలికే దిశగా బోరుగడ్డ చేత విమర్శలతో వైసీపీ అగ్రానాయత్వం వ్యూహాత్మకంగా తొలి అడుగు వేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదలా ఉంటే ఇటీవలి కాలంలో పార్టీ అధినేత జగన్ సజ్జల తీరు పట్ల అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపాదించిన రాజధాని ప్రతిపాదనను పార్టీ శ్రేణులకు చేరవేయడంలో సజ్జల విఫలమయ్యారనీ, అలాగే సొంత మీడియా కూడా మావిగన్ కు ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వకపోవడానిక సజ్జల సూచనలే కారణమనీ జగన్ ఆగ్రహంతో ఉన్నారంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాధాన్యత తగ్గంచి ఆయనకు ఎగ్జిట్ డోర్ చూపించే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారనీ, అందులో భాగంగానే బోరుగడ్డ అనీల్ ను ముందుకు తెచ్చరనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి బోరగడ్డ అనిల్ ధర్నా రానున్న రోజులలో వైసీపీలో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో? విజయసాయి రీఎంట్రీ వార్తలు, బోరుగడ్డ ధర్నా అంశాలను వేరువేరుగా చూడలేమనీ, పార్టీలో రానున్న రోజులలో జరగబోయే మార్పులకు ఇవి సంకేతాలనీ చెబుతున్నారు. Exit door to Sajjala, YSRCP internal differences, Borugadda Anil dharna, Tadepalli Jagan residence, Vijayasai Reddy Reentry
http://www.teluguone.com/news/content/exit-door-to-sajjala-39-228185.html





