ఇప్తెకార్ డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవనం సాగిస్తున్నాడు. చిట్టీల వ్యాపారం చేసి లక్షల రూపాయలు సంపాదించాడు. ఆడ పిల్లల పెళ్లి, అనారోగ్యం వంటి కారణాలతో తన వద్ద చీటీ పాడుకునేవారికి చిట్టీ డబ్బులు మొత్తం ఇచ్చేవాడు కాదు. కమిషన్ ఎక్కువగా తీసుకునేవాడు. అవసరం అని తెలియగానే ఇప్తెకార్ తన దైన స్టైల్ లో దోచేసుకునే వాడు
ఒక రోజు బాధితులు మౌలానా దగ్గరికి వచ్చారు.
చీటీ బాధితులు: సలాం వాలేకుం మౌలానా సాబ్
మౌలానా: వాలేకుం సలాం భాయ్ , కైరియత్ తష్రీప్ రఖ్ నా ( రండి కూర్చొండి)
చీటీ బాదితులు: మౌలానా సాబ్ ఇప్తెకార్ చిట్టీల వ్యాపారంలో కస్టమర్లను మోసం చేస్తున్నాడు. చీటీ డబ్బులు అడిగితే ఏదో ఒకరకంగా మోసం చేస్తున్నాడు. చీటీ డబ్బులు ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్నాడు. తన కు ఇష్టం వచ్చినట్లు ఇస్తున్నాడు. చిట్టీల వ్యాపారం ప్రారంభించే ముందు ప్రతీ ఒక్కరితో నమ్మికగా ఉండే వాడు. ఇపుడు పూర్తిగా మారిపోయాడు.
మౌలానా: డబ్బు, ఆరోగ్యం పరువు ప్రతిష్టగా తీసుకుంటే ఎవరైనా డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. ప్రపంచమే ఒక ముసాఫిర్ ఖానా. పుట్టుక, చావులు ఇక్కడ షరామామూలే. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. డబ్బు, ఆరోగ్యం ఇవన్నీ తాత్కాలికం. అయినా మనిషి వీటి పట్ల ప్రేమను పెంచుకుంటున్నాడు. ఇవి ఎప్పుడైనా మన నుంచి దూరమవుతాయి. అప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లిపోతాం. ధర్మం అనేది ఎల్లవేలలా మన వెంటే ఉంటుంది. ధర్మాన్ని లాక్కోవడం ఎవరి తరం కాదు. అల్లా కోరుకునేది కూడా ధర్మాన్ని ఆచరించడం. ధర్మాన్ని ఆచరించడం వల్ల డిప్రెషన్ లో వచ్చిన వారు లేరు. డబ్బు, ఆరోగ్యం మీద మమకారం పెంచుకుంటే డిప్రెషన్ వస్తుంది. కాంపిటేషన్ వల్ల కూడా మనిషి డిప్రెషన్ లో వెళ్లిపోతున్నాడు. ఈ భౌతిక ప్రపంచం మీద ప్రేమ పెంచుకోవద్దు. లోభం కూడా మంచిది కాదు. కుక్క కూడ లోభి లక్షణాలతో నిండి ఉంటుంది. కుక్క తమ యజమానిని చూసి తోక ఊపుతుంది. కానీ తన జాతికి చెందిన మరో కుక్క తన యజమాని గేటు ముందు నుంచి వెళ్లగానే తన అసలు స్వరూపం చూపిస్తుంది, నేను తినే రొట్టె వేరే కుక్క తన్నుకుపోతుందని ఈర్శ్య, ద్వేషంతో రగిలి పోతుంది. అరుస్తుంది. మరో కుక్క కండలను తన కోరపళ్లతో కొరికి రక్త సిక్తం చేస్తుంది. దీనిని బట్టి కుక్క విశ్వాసం గల జంతువు అనేది అపప్రద. ఈ విషయం కుక్కను పెంచుకునే యజమానికి కూడా తెలియదు. అది విశ్వాసం గల జంతువు అనుకుంటూ బతికేస్తున్నాడు. ఇప్తెకార్ కూడా విశ్వాసం గల వ్యక్తి కాదు అని అతని చేతల్లో తెలిసిపోయింది.జాగ్రత్తగా ఉండండి అంటూ మౌలానా హితవు పలికాడుమ
బదనపల్లి శ్రీనివాసాచారి
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/excessive-love-of-money-is-not-good-25-187746.html
తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, సానంబట్ల గ్రామంలో స్వర్ణముఖీ నది ఒడ్డున 400 ఏళ్ల నాటి శిధిల శివాలయాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సిఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న ఆస్తి వివాదం హాట్ టాపిక్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల మధ్య ఆస్తుల పంపకం విషయంలో తలెత్తిన నిస్సందేహంగా వైఎస్ కుటుంబ పరువును బజారున పడేంది. ప్రజాజీవితంలో ఉన్నవారికి వ్యక్తిగతం అనేది ఉండదని అంటారు. జగన్,షర్మిల విషయంలో అదే జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోతున్నది. హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ, రైతు భరోసా నిధులు వంటి విషయాలలో రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ కు పుంజుకునేందుకు ఇచ్చిన అవకాశాలను బీఆర్ఎస్ సమర్థంగా ఉపయోగించుకోవడంలో విఫలమైంది. పార్టీ అధినేత మౌనం కావచ్చు. పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం కావచ్చు మొత్తంగా బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ స్ఫూర్తి అన్నది కొరవడటమే ఆ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను సమర్ధంగా తిప్పి కొట్టలేకపోవడానికి ప్రధాన కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అధికారం కోల్పోయిన వైసీపీ అధినేత జగన్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేస్తున్నది అధర్మయుద్ధమని ఆయన పార్టీ నేతలే తెలిసో తెలియకో అంగీకరించేస్తున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికలలో కూడా జగన్ అధర్మయుద్ధం చేసే తన పార్టీని గెలిపించారనీ చెప్పకనే చెప్పేస్తున్నారు.
సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ఎదుట ఆత్మాహుతి చేసుకుంటానని మహిళా అఘోరీ ప్రకటన చేసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.శుక్రవారం ఆత్మహుతి చేసుకుంటానని అఘోరీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత వరుసగా రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరుగులేని విజయాలను సాధించిన కేసీఆర్.. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి బోల్తా పడ్డారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న లక్ష్యం అన్నది పైపై మాటే వాస్తవంగా ఆయన దేశానికి ప్రధాని కావాలన్న ఆంక్ష, కాంక్ష తోనే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి, తెలంగాణను వదిలేసి ఇతర రాష్ట్రాల రాజకీయాలలో తలదూర్చారన్నది పరిశీలకులు విశ్లేషణ.
అనంతపురం కలెక్టరేట్ లో గన్ మిస్ ఫైర్ సంచలనమైంది. శుక్రవారం తెల్లవారు జామున కలెక్టరేట్ లో గార్డు డ్యూటీలో ఉన్నాడు.1996 బ్యాచ్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు తన వెపన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయ్యింది.
ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. రాష్ట్ర విభజన తో అప్పులు వినా ఆస్తులు లేని రాష్ట్రంలో, కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా అన్నిటికీ మించి రెవెన్యూ లోటుతో విభజిత ఆంధ్రప్రదేశ్ ఒక అనాధలా మిగిలింది. అలాంటి రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా రూపుదిద్దగలిగేది ఒక్క చంద్రబాబునాయుడు మాత్రమేనని విశ్వసించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి విజయాన్ని కట్టబెట్టారు.
ప్రధాని నరేంద్రమోడీ సైనికులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. దీపావళి పర్వదినం రోజున గుజరాత్ పర్యటనలో ఉన్న మోడీ అక్కడి కచ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న జవాన్లతో కలిసి దీపావళిని వేడుకగా జరుపుకున్నారు.
ప్రముఖ నటుడు కమల్ హాసన్ సోదరుడు , నటుడు, దర్శకుడు చారుహసన్ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె, అలనాటి నటి సుహాసిని ధృవీకరించారు. చారుహసన్ అనేక చిత్రాల్లో నటించారు. దర్శకత్వం వహించారు కూడా. చెన్నయ్ లోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే. ఎన్నికల హామీలలో భాగంగా రేవంత్ సర్కార్ అమలు చేసిన తొలి హామీ కూడా ఇదే. అంతకు మందే కర్నాటక ప్రభుత్వం తమ రాష్ట్రంలో కేఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. అప్పట్లో కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించడానికి ఆ హామీ ఎంతో దోహదపడింది.
దేశ వ్యాప్తంగా దీపావళి పండుగను జనం ఘనంగా జరుపుకున్నారు. దీపావళికి ఒక రోజు ముందు అంటే బుధవారం (అక్టోబర్ 30) నరకచతుర్దశి నుంచే బాణసంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వీకెండ్ దగ్గర పడటం, దీపావళి సందర్భంగా గురువారం (అక్టోబర్ 31) సెలవు దినం కావడంతో భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి అధిక సంఖ్యలో వస్తున్నారు.