విజయ సాయి రెడ్డి పరువుపోయింది..!!
Publish Date:Aug 27, 2018
Advertisement
వైసీపీ నేతలు తొందరపడి నోరుజారి విమర్శలు మూటగట్టుకుంటున్నారు.. ఆ మధ్య వైసీపీ అధినేత జగన్ కాపు రేజర్వేషన్లు, పవన్ పెళ్లిళ్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు పాలైన సంగతి తెలిసిందే.. జగన్ ఆ విమర్శల నుండి బయటపడటానికి చాలా కష్టపడ్డారు.. ఇక రీసెంట్ గా వైసీపీ సీనియర్ నేత విజయ సాయి రెడ్డి తొందరపడి నోరుజారి పరువుపోగొట్టుకున్నారు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. విశాఖ జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్ను ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు కలిశారు.. ఆ వెంటనే ఆయన తమ పార్టీలో చేరుతున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.. అంతేనా సాంబశివరావు చేరికతో వైసీపీకి అదనపు బలం వచ్చిందని చెప్పారు.. ఆయన సలహాలు తీసుకుని రానున్న ఎన్నికలను వైసీపీ సమర్థంగా ఎదుర్కొంటుందని చెప్పారు.. ఇంకేముంది స్వయంగా విజయ సాయి రెడ్డి చెప్పడంతో వైసీపీలోకి మాజీ డీజీపీ సాంబశివరావు చేరిక అంటూ ఒకటే వార్తలు.. దీంతో షాక్ తిన్న సాంబశివరావు ఓ ప్రకటన విడుదల చేసారు.. జగన్ను తాను కలవడం వెనుక ఎటువంటి రాజకీయాలకు తావు లేదని కేవలం గంగవరం పోర్టు సీఈవో హోదాలో మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని తెలిపారు.. ప్రస్తుతానికి తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని వెల్లడించారు.. దీంతో విజయసాయి రెడ్డిపై నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు.. అసలు ఏమీ లేకుండానే పార్టీలో చేరుతున్నారని ప్రకటించి విజయసాయి రెడ్డి పరువు పోగొట్టుకున్నారని కొందరు అంటుంటే.. గతంలో అధికారిగా చంద్రబాబుని కూడా కలిశారు అంతమాత్రాన టీడీపీలో కూడా చేరినట్టా అని ప్రశ్నిస్తున్నారు.. అందుకే అంటారు రాజకీయనాయకులు ఒకటికి రెండుసార్లు అలోచించి మాట్లాడాలని.. లేదంటే ఇలానే అవుతుంది.
http://www.teluguone.com/news/content/ex-dgp-sambasiva-rao-denies-vijaya-sai-reddy-comments-on-party-joining-39-83262.html





