ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దం
ఈ నెల 5న(బుధవారం) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ప్రచార పర్వం నిన్నటితో ముగియడంతో పోలింగ్ మిగిలింది. ఆప్, ప్రతిపక్ష బిజెపి మధ్య హోరా హోరి పోరు జరుగనుంది. ఎన్నికల ప్రచార అంశాల్లో కాలుష్యం, తాగునీటి సమస్య ప్రధాన అంశాలుగా చేరాయి. యమునా నది కాలుష్యం ఎన్నికల ప్రచారం అస్త్రంగా నిలిచింది. ఆప్, కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. బుధవారం జరుగనున్న పోలింగ్ లో కోటి 56 లక్షల మంది ఓటేయనున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆప్ మూడోసారి దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటే 25 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న బిజెపి అధికారంలో రావాలని చూస్తుంది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోని కాంగ్రెస్ ఉనికి కోసం తహతహలాడుతోంది. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్లొన్నారు. మేనిఫెస్టోను విడుదల చేశారు. జాతీయ స్థాయిలో అగ్రనేతలు మల్లి ఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాందీలు ఢిల్లీ చుట్టేశారు. బిజెపి తరపున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఢిల్లీలోని తెలుగువారందరూ బిజెపికే వోటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీ నేతృత్వంలో భారత దేశం వేగంగా అభివృద్ది చెందుతుందన్నారు. బడ్జెట్ లో టెక్నాలజీ, వ్యవసాయరంగాలకు ప్రోత్సహించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఫిబ్రవరి 8న ఎన్నికల కౌంటింగ్ జరుగనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/everything-is-ready-for-polling-of-delhi-assembly-elections-39-192353.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది