Publish Date:Aug 12, 2022
జైల్లో దొంగకి తిండి సంగతి ఎలా ఉన్నా, పోలీస్ లైన్స్ మెస్‌లో మాత్రం భోజనం బహు రుచిగా ఉండా ల్సిందే. ఏమాత్రం ఉప్పు తగ్గినా, కూరలో కారం ఎక్కువయినా, నాన్‌వెజ్ రుచిగా లేకపోయినా మండిపడ తారా, సర్దుకుపోతారా? ఏమోగాని మనోజ్ కుమార్ అనే కానిస్టేబుల్ మాత్రం తిండి చాలా దారుణంగా ఉం దని ఏకంగా పళ్లెం చూపుతూ కన్నీళ్లపర్యంతమై అందరికీ తెలిసేలా చేశాడు.
ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్ పోలీస్ మెస్‌లో రోటీలు, అన్నం, పప్పు పెడతారు. కానీ అవి ఏమాత్రం రుచి కరంగా ఉండడంలేదని, పప్పు మరీ నీళ్లగా ఉంటోందని ఈ తిండిని కనీసం కుక్కలు కూడా తినవని గోడు పెడుతున్నాడు. దీన్ని గురించి ఎస్.పికీ ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నాడు కానిస్టేబుల్ మనోజ్. పన్నెండుగంటల డ్యూటీ తర్వాత ఇలాంటి తిండి తినాల్సి వస్తోందని కన్నీళ్లపర్యంతమ య్యాడు.
ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ పోలీసు అధికారులకు మంచి నాణ్యమైన ఆహారం అందేలా చూసేందుకు ప్రత్యేకించి అలవెన్స్ ప్రకటించినప్పటికీ మెస్ లో మాత్రం తినడానికి వీలులేని ఆహారాన్ని ఇస్తున్నారని మనోజ్ కుమార్ మండిపడ్డాడు. అసలు బలమైన తిండి తినకపోతే డ్యూటీ ఎలా చేస్తామన్నది ఆలోచిం చాలని అన్నాడు. మెస్ కుంభకోణంలో సీనియర్ సీపీ, డిసీపీ పాత్ర కూడా ఉందని ఆరోపిం చాడు.
మొత్తానికి మనోజ్ కుమార్ ఫిరోజాబాద్ పోలీస్ మెస్ భాగోతం బయటపెట్టడానికే ఏకంగా వీడియో చేసి మరీ నెటిజన్ల దృష్టికి రావడం గమనార్హం. ఇదిలాఉండగా, మెస్ వ్యతిరేకంగా చేస్తున్న నిరసన ప్రదర్శ న ప్రదేశం నుంచి మనోజ్‌ను పోలీసులు వేరే ప్రాంతానికి తరలించారు. కాగా మెస్ ఆహారం విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఫిరోజాబాద్ పోలీసులు సిటీ సీఓను కోరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/even-dogs-didnt-eat-this-meals-25-141816.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.