కుట్రదారులు కుట్రలతోనే నాశనం! కేసీఆర్ కు ఈటల శాపం..

Publish Date:Nov 3, 2021

Advertisement

హుజురాబాద్ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. హుజురాబాద్ లో ఎన్ని కుట్రలు చేసినా తనను ఓడించలేకపోయారని చెప్పారు. ప్రజలంతా ఏకోన్ముఖంగా కేసీఆర్ చెంప చెల్లుమనిపించారన్నారు ఈటల. ప్రపంచ చరిత్రలో ఈ ఫలితం గొప్ప అధ్యాయమన్నారు. వందల కోట్ల రూపాయలు, మద్యం, పథకాలు పెట్టినా, ప్రతి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసినా ప్రజలు వ్యూహాత్మకంగా వ్యవహరించారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల ఆత్మగౌరవం బావుటాను ఎగురవేసి విధంగా ధర్మం వైపు.. హుజరాబాద్ ప్రజలు నిలబడ్డారన్నాపు ఈటల రాజేందర్. తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా, కాళ్లు కడిగి నెత్తిన పోసుకున్నా.. వాళ్ల రుణం తీర్చుకోలేనేంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 

తనపై కుట్రలు చేసి కేసీఆర్ బయటికి పంపిస్తే బీజేపీ అక్కున చేర్చుకుందని చెప్పారు ఈటల రాజేందర్. తనకు అన్ని రకాలుగా అండగా ఉంటానని అమిత్ షా హామీ ఇచ్చారని తెలిపారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి తనకు బాసటగా నిలిచారని చెప్పారు. 2018లో తనకు లక్షల 4 వేల ఓట్లు వస్తే ఇప్పుడు లక్ష 7 వేల ఓట్లు వచ్చాయన్నారు. తన జెండాతో, తన బొమ్మతో నేను గెలిచానని అహంకారంగా మాట్లాడారో.. దానికి విరుద్ధంగా ప్రజలు పిలుపునిచ్చారని రాజేందర్ వెల్లడించారు. కేసీఆర్ అహంకారం మీద తెలంగాణ ప్రజలు సాధించిన విజయమన్నారు. 10 లక్షలు ఇచ్చినా అమ్ముడుపోబోమని  దళిత బిడ్డలు ఎంతో గొప్పగా తనకు అండగా నిలిచి ఓట్లు వేశారని చెప్పారు. 

స్మశాన వాటికలకు పిలిపించుకొని మరీ డబ్బులు పంచారని ఆరోపించారు ఈటల రాజేందర్. ముందుగా 6000, తర్వాత నాలుగు వేల చొప్పున పంచారన్నారు. పోలీసుల అండతో ఎస్కార్ట్ వాహనంలో డబ్బులు తెచ్చి పంచారని చెప్పారు.చివరికి తెల్లబట్టలో పసుపు బియ్యం పెట్టి దేవుడు ముందు ప్రమాణం చేయించుకున్నారని తెలిపారు. పెన్షన్ పోతుందని వృద్ధులను బెదిరించారని ఆరోపించారు. దళిత బంధు కూడా ఆపేస్తామని భయపెట్టారని తెలిపారు. 

కుట్రదారులు ఎప్పుడు కుట్రలతోనే నాశనం అవుతారన్నారు ఈటల రాజేందర్. తనపై పోటీకి రావాలని కేసీఆర్, హరీష్ రావు కు సవాల్ చేస్తే.. రాకపోగా పొలగాన్ని నిలబెట్టారన్నారు. రెండు గుంటల వ్యక్తి ఇన్ని కోట్లు ఎలా ఖర్చు చేశాడని ఈటల ప్రశ్నించారు. కుట్రలతో  దొంగ ఉత్తరాలతో తనను ఓడించాలని చూస్తే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. సూర్యుడి మీద ఉమ్మి వేస్తే ఎలా ఉంటుందో అలాగే జరిగిందన్నారు. హుజురాబాద్ వచ్చి కుట్రలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల భరతం పడతానన్నారు. వాళ్ల నియోజకవర్గాల్లో పర్యటించి ఇక్కడ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేలా ఒత్తిడి తెస్తానని చెప్పారు ఈటల రాజేందర్. 

By
en-us Political News

  
హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థి  రోహిత్ వేముల దళితుడు కాదని,
మరో పది రోజుల్లో  తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సంపన్న అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశమైంది. 
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు.. అవమానాలు, అభినందనలు సర్వసాధారణమే. నాకు వాళ్లు గౌరవం ఇవ్వలేదు.. నన్ను వాళ్లు విమర్శించారంటూ.. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటే సదరు నేతకు రాజకీయ భవిష్యత్తుతో పాటు.. మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోంది.
మీరేదో పనిలో వుంటారు.. లేదా ట్రావెల్ చేస్తూ వుంటారు... లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వుంటారు.
కోవిషీల్డ్ తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని ఆస్ట్రాజెనికా అంగీకరించిన  రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమైంది. వ్యాక్సిన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న ఈ సమయంలో ఆ సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో మాయమవ్వడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.
police filed murder attempt case on perni kittu, perin kittu, murder attempt case, ap politics
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం మాత్రమే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని మొదటి నుంచీ అంతా భావిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా చేజేతులా కాంగ్రెస్ ఖమ్మంలో అవకాశాలను చే జార్చుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్‌ సాధించే స్కోరు జీరో అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. బీఆర్ఎస్ నాయకులకు
 బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు.
ఏపీలో బీజేపీ రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తోందా? పేరుకు పొత్తు తెలుగుదేశం, జనసేనతో.. మద్దతు మాత్రం అధికార వైసీపీకే అన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దేశంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. రెండు దశల పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ నిపుణులు ఉత్తరాదిలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ భారీగా నష్టపోవడం ఖాయమని గంటాపథంగా చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.